Breaking News

27/12/2019

రాజధాని భూముల వ్యవహారంపై సీబీఐ చే దర్యాప్తు: మంత్రి పేర్ని నాని

అమరావతి డిసెంబర్ 27   (way2newstv.in)
 రాజధాని భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తామని మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పేశారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియా మీట్ నిర్వహించిన మంత్రి నాని.. నైతిక విలువలను దిగజార్చేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శలు గుప్పించారు. భారీస్థాయిలో భూములు ఎవరెవరు కొన్నారో విచారణలో తేలుస్తామని.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. న్యాయనిపుణుల సలహా తీసుకుని లోకాయుక్త లేదా సీబీఐ దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 
రాజధాని భూముల వ్యవహారంపై సీబీఐ చే దర్యాప్తు: మంత్రి పేర్ని నాని

‘సీఆర్డీఏలో జరిగిన అవినీతిపై కేబినెట్‌ సబ్‌కమిటీ నివేదిక ఇచ్చింది. అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా గత ప్రభుత్వంలోని పెద్దల తీరు ఉంది. రాజధాని ప్రకటనకు ముందే మాజీ మంత్రులు, కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్లు, ఇంట్లో పనివాళ్ల పేరుతో భారీగా భూములు కొన్నారు. వీటిన్నంటిపైనా వాళ్లు కోరుకున్నట్టుగానే సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం. గత ప్రభుత్వంలో నారాయణ కమిటీ రిపోర్ట్‌ ఆధారంగా ఊహాజనిత రాజధాని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను కాదని నారాయణ కమిటీ నివేదిక ఆధారంగా భూసమీకరణ చేశారు’ అని మంత్రి నాని ఆరోపించారు.

No comments:

Post a Comment