Breaking News

12/12/2019

గూడ్స్ కెరియర్స్గ్ గా వజ్ర బస్సులు

వరంగల్, డిసెంబర్ 12, (way2newstv.in)
ఆర్టీసీకి గుదిబండగా మారిన వజ్ర బస్సులు ఇక గూడ్స్ క్యారియర్లుగా మారబోతున్నాయి. ఇంటి వద్దకే వస్తువులను చేరవేసే సర్వీసులుగా కొత్త అవతారం ఎత్తబోతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇంకొద్ది రోజుల్లో పూర్తిస్థాయి గూడ్స్‌‌‌‌‌‌‌‌ క్యారియర్లుగా బస్సులు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ కానున్నాయి.వజ్ర బస్సులను 2017లో ప్రారంభించారు. కాలనీల నుంచి నడిపితే మస్తు లాభాలొస్తాయని ఆర్భాటంగా స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇంటి వద్దకే బస్సొచ్చే సౌకర్యంతో పాటు టికెట్ బుకింగ్ కోసం యాప్‌‌‌‌‌‌‌‌ రూపొందించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్, గోదావరిఖని, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లకు నడిపారు. కానీ గరుడ బస్సు టికెట్‌‌‌‌‌‌‌‌ రేట్లతో సమానంగా చార్జీలుండటంతో ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఏసీ సహా లగ్జరీ సౌకర్యాలున్నా ఇంట్రస్ట్ చూపలేదు.
గూడ్స్ కెరియర్స్గ్ గా వజ్ర బస్సులు

ఆర్టీసీ అప్‌‌‌‌‌‌‌‌డేట్ అవ్వాలని, బస్సులను ప్రయాణికుల వద్దకే చేర్చేలా కొత్త బస్సులు తీసుకురావాలని అప్పట్లో ఆర్టీసీ అధికారులకు సీఎం సూచించారు. దీంతో మినీ బస్సులైతే ఆదరణ ఉంటుందని వజ్ర బస్సులను తీసుకొచ్చారు. కానీ ఈ ఐడియా వర్కవుట్ కాలేదు. ఇటీవల సీఎంతో సమావేశంలో మళ్లీ ఆయనే వ్యాపారులకు ఉపయోగపడేలా బస్సుల్ని మార్చాలని సూచించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వచ్చి వస్తువులు కొంటుంటారని.. వాళ్ల వస్తువులను ఇంటి వరకు అందించేలా బస్సు సేవలుంటే బాగుంటుందని చెప్పారు. దీంతో బస్సులను గూడ్స్ క్యారియర్లుగా మార్చాలని అధికారులు ఆలోచిస్తున్నారు. గూడ్స్‌‌‌‌‌‌‌‌కు పూర్తి స్థాయిలో బస్సులను అందుబాటులో ఉంచితే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టు సంస్థలకు దీటుగా లాభాలొస్తాయనిభావిస్తున్నారు.రాష్ట్ర ఆర్టీసీకి దాదాపు 100 వజ్ర బస్సులున్నాయి. వీటి వల్ల ఆర్టీసీకి నిర్వహణ వ్యయం తడిసిమోపడవుతోంది. కిలోమీటర్‌‌‌‌‌‌‌‌కు రూ. 35 రావాల్సి ఉండగా రెండేళ్లుగా రూ.15 కూడా వస్తలేవు. 21 సీట్ల కెపాసిటీ ఉన్న బస్సులు కొన్నిసార్లు ఒకరిద్దరితోనే వెళ్లాల్సి వచ్చేది. లాభాల్లోకి తెచ్చేందుకు అధికారులు తంటాలు పడ్డా ఫలితం లేకుండా పోయింది.

No comments:

Post a Comment