Breaking News

24/12/2019

కృష్ణకిషోర్‌ను సస్పెండ్ వ్యవహారంపై క్యాట్ సీరియస్

అమరావతి డిసెంబర్ 24 (way2newstv.in)
ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన వ్యవహారంపై క్యాట్ సీరియస్ అయ్యింది. అధికారి విషయంలో ఏపీ ప్రభుత్వం హద్దులు దాటిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఏపీ ప్రభుత్వం పిచ్చిగా ప్రవర్తించింది. కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌లో నిబంధనలు పాటించలేదు. కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌ అసమంజసం. రాష్ట్ర ప్రభుత్వం తన శక్తియుక్తులను అభివృద్ధికి వినియోగించాలి. 
కృష్ణకిషోర్‌ను సస్పెండ్ వ్యవహారంపై క్యాట్ సీరియస్

కృష్ణ కిషోర్‌కి పెండింగ్‌లో ఉన్న జీతం వెంటనే చెల్లించాలి’ అని ప్రభుత్వానికి క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది. కాగా అంతకు మునుపు.. ఐఆర్‌ఎస్‌ కృష్ణకిషోర్‌ని ఎందుకు రిలీవ్‌ చేయలేదని ప్రభుత్వాన్ని క్యాట్ ప్రశ్నించింది. కేంద్రం ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని క్యాట్‌ ఆగ్రహించింది. తక్షణం వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల క్రితం ఏపీఈడీబీ సీఈవో కృష్ణకిషోర్‌‌ను ప్రభుత్వం సస్పెన్షన్‌ చేసిన విషయం విదితమే. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కిషోర్‌పై సీఐడీ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా పై విధంగా రియాక్ట్ అయ్యింది.

No comments:

Post a Comment