Breaking News

20/12/2019

దిశ చట్టాన్ని జగన్ మహిళలకు గిఫ్ట్‌గా ఇచ్చారు: మంత్రి వనిత

గుంటూరు డిసెంబర్ 20(way2newstv.in)
తన పుట్టినరోజు సందర్భంగా దిశ చట్టాన్ని జగన్ మహిళలకు గిఫ్ట్‌గా ఇచ్చారని మంత్రి తానేటి వనిత తెలిపారు. తెలంగాణలో దిశ ఘటన జరిగితే.. అక్కడ ప్రభుత్వం ఇప్పటి దాకా దిశ చట్టం చేయలేదన్నారు. 
దిశ చట్టాన్ని జగన్ మహిళలకు గిఫ్ట్‌గా ఇచ్చారు: మంత్రి వనిత

నిర్భయ సంఘటన జరిగిన ఢిల్లీలో కూడా అక్కడి ప్రభుత్వం చట్టం చేయలేదని గుర్తు చేశారు కానీ ముందు చూపుతో జగన్ ఏపీలో దిశ చట్టాన్ని అమలు చేశారన్నారు. చట్టం కోసం అంతా ఎదురు చూస్తున్నామన్నారు. మహిళ రక్షణ కోసం దిశ చట్టం వరంగా మారబోతోందన్నారు. టెక్నాలజీని ఎంత వరకు వాడాలో అంత వరకు మాత్రమే వాడాలన్నారు. ఎక్కువగా వాడితే మనకే ఇబ్బంది అని తానేటి వనిత తెలిపారు.

No comments:

Post a Comment