విశాఖపట్టణం, డిసెంబర్ 23, (way2newstv.in)
ఈ ఏడాది మొదట్లో అవంతి కేవలం టీడీపీ ఎంపీగా ఉన్నారు. అపుడు కూడా ఆయన పార్టీ మారాలని ఆలోచనలు చేస్తున్నా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే ఎన్నికల ముందు ఆయన ఒక్కసారిగా వైసీపీలోకి జంప్ చేయడం భీమిలీ టికెట్ పట్టేసి గెలవడం, వైసీపీ కూడా అధికారంలోకి రావడం మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. తాను కోరుకున్న చోట ఎమ్మెల్యేతో పాటు, మంత్రి కావడమే అవంతి సాధించిన అతి పెద్ద విజయమని ఇప్పటిదాకా ఆయన అనుచరులు సంబరపడ్డారు. ఇపుడు దానికి మించి అవంతి జాక్ పాటే కొట్టేశారని శత్రువులు సైతం అసూయపడుతున్నారట. అదేంటి అంటే జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించడం. పైగా భీమిలీలోనే సచివాలయం ఏర్పాటు చేయాలనుకోవడం.విశాఖలో ప్రభుత్వ స్థలాలు అనేకం ఉన్నాయి.
భీమిలిలో పరిపాలనా రాజధాని
భౌగోళికంగా అతి పెద్ద జిల్లాగా ఉన్న విశాఖలో మైదాన ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ఉన్నాయి. అయితే సిటీకి దగ్గరలో సచివాలయం ఏర్పాటు చేయాలన్నది జగన్ సర్కార్ అలోచనగా ఉంది. సీవ్యూతో నాచురల్ బ్యూటీ కలగలిపేలా రాజధాని ప్రాంతం ఉండాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఎక్కడో విసిరేసినట్లుగా కాకుండా అంతా సులువుగా సచివాలయానికి వచ్చేలా ఏర్పాటు ఉండాలన్నది ఒక విధానంగా పెట్టుకున్నారు. సిటీ కల్చర్ తో రాజధాని ఉండాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. . దాంతో భీమిలీ మీద సర్కార్ కన్ను పడింది. ఇక్కడ కూడా వేలాదిగా ప్రభుత్వ భూములు ఉండడం కలసివస్తోంది.మంత్రి అవంతి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీ నియోజకవర్గంలోనే సచివాలయం ఏర్పాటు అవుతుందని జగన్ కి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి చెప్పేశారు. దాంతో కాపులుప్పాడలో కొత్త సచివాలయం రావడం ఖాయంగా గట్టిగా ప్రచారం సాగుతోంది. సాగర తీరానికి అభిముఖంగా ఉన్న కాపులుప్పాడలో దాదాపుగా నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీనికి సమీకరించే పనిలో సర్కార్ పెద్దలు ఉన్నారు. అదే కనుక జరిగితే ఇటు విశాఖకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే సచివాలయం వస్తుంది.జగన్ సర్కార్లో మంత్రిగా చేరిన అవంతికి ఇపుడు ఒక్కసారిగా మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. ఏకంగా సచివాలయం భూసేకరణ బాధ్యతను ఆయన మీదనే పెట్టేశారు. ఈ మొత్తం పనులన్నీ చక్కబెట్టమని జగన్ తరఫున విజయసాయిరెడ్డి ఆయనకు సూచించారు. దీంతో మంత్రి పంట పండిందని అంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా భీమిలీ ప్రాముఖ్యత పర్యాటకపరంగా మారలేదన్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఇపుడు ప్రభుత్వమే అక్కడకు వస్తే ఆ జోరు ఎంతలా ఉంటుందో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద చూసుకుంటే కొత్త రాజధాని విషయంలో భీమిలీ కీలకం అవుతూంటే, మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం తన హవా చాటుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.
No comments:
Post a Comment