Breaking News

09/12/2019

యాదాద్రిలో గవర్నర్ తమిళిసై

యాదాద్రి డిసెంబర్ 9  (way2newstv.in)
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం ఉదయం యాదాద్రి నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు, పూజారులు అధికార మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే సునీత, కలెక్టర్ అనితా రామచంద్రన్,  ఆలయ ఈవో, అధికారులు, వేద పండితులు పాల్తోన్నారు.  
యాదాద్రిలో గవర్నర్ తమిళిసై

యాదాద్రి పునర్నిర్మాణ పనులను మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గవర్నర్కు వివరించారు. తొలిసారి యాదాద్రి ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి ఘనంగా ఏర్పాట్లు చేశారు. గవర్నర్ మాట్లాడుతూ . స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది.  తెలంగాణ రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు.

No comments:

Post a Comment