Breaking News

23/12/2019

ఆస్తి పన్ను పెంపునకు కసరత్తు

హైద్రాబాద్, డిసెంబర్ 24, (way2newstv.in):
బల్దియాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆస్తిపన్నును పెంచేందుకు సర్కార్‌ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయిగా మిగిలింది. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం ప్రతి ఐదేండ్లకోసారి ఆస్తిపన్నును సవరించాలి. కానీ 2002 నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సవరణా చేయలేదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను సవరణ కచ్చితంగా ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో రెసిడెన్షియల్‌ భవనాలకు ఆస్తిపన్ను పెంచారు. అప్పట్నుంచీ ఆస్తిపన్ను సవరణ చేయలేదు. కమర్షియల్‌ భవనాలు, కంపెనీలు, ఇతర సంస్థలకు సంబంధించిన ఆస్తిపన్ను 2007లో సవరించారు. 
ఆస్తి పన్ను పెంపునకు కసరత్తు

జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం ప్రతి ఐదేండ్లకోసారి ఆస్తిపన్నును సవరణ చేయాలి. కానీ ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని ఎలాంటి సవరణకూ సాహసించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 99 వార్డులను కైవసం చేసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను సవరణ చేయడానికి ప్రతిపాదనలు తయారు చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్‌ బాధ్యతలు తీసుకున్నాక గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడానికి అంతా సిద్ధం చేశారు. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ దాన్ని నిలిపేశారనీ, లేకపోతే ఆస్తిపన్ను పెరిగేదనీ ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయి మెజార్టీ రావడంతో ఆస్తిపన్ను పెంపు ఖాయమనీ, అది పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఉండే అవకాశాలున్నాయని సమాచారంజీహెచ్‌ఎంసీ పరిధిలో 21లక్షలకుపైగా రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ కేటగిరిలో ఆస్తిపన్ను చెల్లించేవారు ఉన్నారు. వారిద్వారా గతేడాది రూ.1,362 కోట్లు లక్ష్యంగా పెట్టుకుని సుమారు రూ.1,350 కోట్ల ఆస్తిపన్నును వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,725 కోట్లు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు సుమారు రూ.900 కోట్ల వరకూ వసూలు చేశారు. మార్చి 31వ తేదీ వరకూ కనీసం రూ.1500 కోట్లు వసూలు చేయాలని అధికారులు చర్యలు ప్రారంభించారు. నిధుల కేటాయింపులో జీహెచ్‌ఎంసీపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లకు ఒక న్యాయం, జీహెచ్‌ఎంసీకి మరో న్యాయం పాటిస్తున్నది. 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలైనా ఇవ్వాలి లేదంటే ఫర్‌క్యాపిట గ్రాంట్స్‌ అయినా ఇవ్వాలి. జీహెచ్‌ఎంసీ తప్ప అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుంది. అటు వేతనాలివ్వకపోగా, ఫర్‌క్యాపిట గ్రాంట్స్‌ కూడా ఇవ్వడంలేదు. దీంతోపాటు స్టాంపు డ్యూటీ వసూళ్లలో జీహెచ్‌ఎంసీ ఒకటిన్నర శాతం వాటా ఇవ్వాలి. రెండేండ్లుగా జీహెచ్‌ఎంసీకి సుమారు రూ.500 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ నయాపైసా ఇవ్వలేదు.మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే అప్పులు తీసుకోవడం, తిరిగి పన్ను పెంపు ద్వారా ఆదాయం సమకూరడం ఉంటున్నది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, బడ్జెట్‌ కేటాయింపులపై ఆశలు పెట్టుకోవద్దనీ, సొంతంగా నిధులను సమీకరించే ప్రయత్నాలు చేయాలనీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీకి బడ్జెట్‌లో కేటాయింపులే తక్కువ. వాటినీ విడుదల చేయడం లేదు. పైగా లక్ష డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు, ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. వాటిని పూర్తిచేయడానికి బాండ్ల ద్వారా రూ.1,000 కోట్లు, బ్యాంకు రుణాల ద్వారా రూ.2,500 కోట్లు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. దీనికి సర్కార్‌ కౌంటర్‌ గ్యారంటీ కూడా ఇచ్చింది. బాండ్ల ద్వారా రూ.400 కోట్లు కూడా తీసుకున్నారు. వాటిలో సుమారు రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేసింది.

No comments:

Post a Comment