Breaking News

30/12/2019

విశాలమైన రోడ్లు..కొత్త లే ఔట్లు...

వరంగల్, డిసెంబర్ 30, (way2newstv.in)
పురపాలక సంస్థల విస్తరిత ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ పరిపాలనా వ్యవహారాల విభాగం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా లేఅవుట్లకు అనుమతులు మంజూరులో నూతన నియమావళిని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా అందులో కొత్తగా ఆవిర్భవించినవి 68 ఉన్నాయి. వీటి పరిధిలో వచ్చే లేఅవుట్లకు రోడ్లు భవిష్యత్తును దృష్టిలోపెట్టుకుని విశాలమైన రోడ్లను ప్రతిపాదిస్తున్నది పురపాలక విభాగం. ఈ మేరకు లేఅవుట్ల విస్తీర్ణంను పరిగణలోకి తీసుకుని ప్రత్యేకంగా రోడ్ల వెడల్పును నిర్ణయిస్తూ కొత్త నియమనిబంధనలను రూపొందించింది. ప్రతి లేఅవుట్లలోనూ కనీస సదుపాయాలు, వ్యాపార కేటగిరీ, ఖాళీ ప్రదేశాలను ఖరారు చేస్తూ ప్రత్యేక నియమావళిని తీసుకురానున్నది. 
విశాలమైన రోడ్లు..కొత్త లే ఔట్లు...

వచ్చే ఏడాది జనవరి మొ దటి వారంలో కొత్త నిబంధనలను కార్యరూపంలో కి తీసుకువస్తూ ప్రత్యేకంగా జిఓను విడుదల చేయాలని మున్సిపల్ విభాగం నిర్ణయించినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.పట్టణ స్థానిక సంస్థల పరిధిలో లేఅవుట్లకు కనీసంగా 40 అడుగుల వెడల్పున్న రోడ్డు ప్రధాన రోడ్డుకు అనుసం ధానం(అప్రోచ్)గా ఉండాలి. లేఅవుట్లలోని రోడ్ల పొడవులను బట్టి ఆయా రోడ్డుల వెడల్పును పురపాలక విభాగం ఖరారు చేసింది. రోడ్లు 600 మీ.ల పొడవు వరకున్న లేఅవుట్లలో ఆ రోడ్డు వెడల్పు 40 అడుగులు(12మీ.లు) కనీసంగా ఉండి, క్యారేజ్‌వే 6 మీ.లుగా ఉండాలని నిర్ణయించింది. రోడ్డు పొడవు 600 నుంచి 1000 మీ.ల వరకు ఉన్న లేఅవుట్‌కు కనీసంగా 60 అడుగు(18 మీ.లు)లు రోడ్డు ఉండాలి. క్యారేజ్‌వే 11 మీ.లు తప్పనిసరి. రోడ్డు పొడవు 1000 మీ.లుకు మించిన రోడ్డు పొడవును పరిగణలోకి తీసుకుని 80 అడుగు(24 మీ.లు)లుగా ఉండాలని నిర్ణయించింది. ప్రతి లేఅవుట్‌లో కనీసంగా 10 శాతం తక్కువగా కాకుండా మౌలిక వసతులకు కేటాయించాలి. ఈ 10 శాతంలో 7.5 శాతం ఉద్యానవనాలకు, క్రీడామైదానాలకు కేటాయించాలి. 1 శాతం సాంఘిక సదుపాయాలు, 1 శాతం భూమిలో నీటి ట్యాంకర్‌లు, సెప్టిక్ ట్యాంక్, మురుగు నీటి శుద్ధి కేంద్రం, విద్యుత్ ట్రాన్స్‌ఫర్, ఘనవ్యర్థాల నిర్వహణ వంటివి, 0.5 శాతం సాధారణ పార్కింగ్ స్థలాలను కేటాయించాలి.కనీస ప్లాటు విస్తీర్ణం 50 చ.మీ.లకు తక్కువగా కా కుండా ఉండాలి. ప్లాటు కనీస వెడల్పు 6 మీ.లకు తక్కువగాకుండా ఉండాలని నిర్ణయించింది. ప్రతి లేఅవుట్‌కు దరఖాస్తు చేసుకున్న వారు విధిగా లేఅవుట్‌లోని ప్లాటెడ్ ఏరియాలో 15 శాతాన్ని మార్టిగేజ్ చేయాలి. 50 ఎకరాలకు మించి విస్తీర్ణమున్న లేఅవుట్లలో స్థల యజమాని లేదా అభివృద్ధిపరిచే వారు విధిగా విద్యా సదుపాయాలు, ఆరోగ్యం, వ్యాపారం, సాఘికం, సమాచారం వంటి తదితర సదుపాయాలను కల్పించాల్సిందే. 50 ఎకరాలకు పైబడిన లేఅవుట్లలో కనీసంగా ఒక లక్ష చ.గ.లు ప్లాట్లుగా వస్తాయి. 50 కుటుంబాలకు పైబడి ఉం టాయి. అందుకే ఆ కుటుంబాలకు సంబంధించిన విద్య ఆరోగ్య సదుపాయాలు తప్పనిసరిచేస్తూ పురపాలక విభాగం నియమావళిని తీసుకువస్తున్నది.

No comments:

Post a Comment