హైద్రాబాద్, డిసెంబర్ 30, (way2newstv.in)
ఎక్కాల్సిన బస్సు కోసం ఒక్కోసారి గంటల తరబడి వెయిట్ చేసి చేసి విసుగుపుడుతుంది. ఎప్పుడొస్తుంది రా బాబూ.. అని చిరాకుపడుతుంది. ఆ చీకూచింతా లేకుండా ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో తెలిస్తే ఎలా ఉంటుంది? మస్తుంటది కదా. కొద్ది రోజుల్లోనే ఆ సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో గ్లోబల్ పొజిషన్ సిస్టం (జీపీఎస్)ను పెట్టేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో ఆ ప్రాసెస్ను స్టార్ట్ చేసినా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ ఆ పనులు జోరందుకున్నాయి. రెండు మూడు నెలల్లో అన్ని బస్సుల్లోనూ అది అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సేఫ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి వీటిని ఏర్పాటు చేయిస్తోంది ఆర్టీసీ. ఇప్పటికే దాదాపు 400 హై ఎండ్ బస్సులకు జీపీఎస్ను పెట్టారు. ఇప్పుడు అన్ని బస్సుల్లోనూ ఏర్పాటు చేయనుంది.
ఆర్టీసీ బస్సుల అప్ డేట్ తో యాప్
ఆర్టీసీకి ఒక్క పైసా ఖర్చు కూడా లేదు. మొత్తం సేఫ్ సంస్థే చూసుకుంటుంది. జీపీఎస్ను పెట్టాక కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయనున్నారు. యాప్ను అందుబాటులోకి తేనున్నారు. మనం ఉండే ప్లేస్కు దగ్గర్లోని బస్టాండ్, స్టార్టింగ్, ఎండింగ్ ప్లేస్లను టైప్ చేస్తే ఎన్ని బస్సులున్నాయో యాప్లో తెలుసుకోవచ్చు. ఒకవేళ బస్సులు లేకపోతే ఏ టైంకు వస్తాయో, ఆ బస్సు ఎక్కడుందో కూడా తెలుసుకోవచ్చు.ఊర్లకు వచ్చే బస్సులను కొన్ని సందర్భాల్లో ఎలాంటి సమాచారం లేకుండానే రద్దు చేస్తుంటారు. బస్సులు ఎప్పుడొస్తాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో బస్సు దొరకాలంటే ముందుగానే వెళ్లి బస్టాండ్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు జీపీఎస్తో వాటికి చెక్ పెట్టొచ్చు. బస్సు ఎక్కడుందో, ఏ టైంకు వస్తుందో తెలుసుకుని బస్టాండుకు వెళ్లొచ్చు. ఎక్కువసేపు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. జీపీఎస్ ఆడవాళ్లకు మరింత ఉపయోగంగా ఉంటుంది. బస్సుల కోసం ఎదురు చూస్తున్న టైంలో వాళ్లు ఆకతాయిల వేధింపులు, చైన్ స్నాచింగ్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. జీపీఎస్ వస్తే ఆ సమస్యా తగ్గే అవకాశాలున్నాయి. ఫిర్యాదు చేస్తే బస్సులోని జీపీఎస్ ఆధారంగా పోలీసులు నిమిషాల్లోనే చేరుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేగాకుండా పోలీస్ కంట్రోల్ రూంకు బస్సుల్లోని జీపీఎస్ను అనుసంధానించడం ద్వారా ట్రాఫిక్ వివరాలనూ తెలుసుకోనున్నారు పోలీసులు. బస్సు వేగంతో పాటు దాని కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టొచ్చు. బస్సు మధ్యలో ఆగిపోయినా, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగినా వెంటనే దాని వివరాలు తెలుస్తాయి. ఏపీలో ఇప్పటికే జీపీఎస్ను పెట్టినా, యాప్లో ఇబ్బందులొచ్చాయి. పనిచేయడం మానేసింది. నెలవుతున్నా సమస్య తీరలేదు. దీంతో ప్రయాణికులు మండిపడుతున్నారు.
No comments:
Post a Comment