Breaking News

20/12/2019

కొత్త అనుమానాలతో జనసేనాని

విజయవాడ, డిసెంబర్ 20(way2newstv.in)
రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు ఉండాల్సింది.. విశ్వాసం.. విశ్వసనీయ రాజ‌కీయాలే నాయ‌కుల‌ను ప‌దికాలాల పాటు ప్రజ‌ల‌కు చేరువ చేస్తాయి. అలాంటి విశ్వసనీయ‌తే. దివంగ‌త వైఎస్‌ను ప్రజ‌ల‌కు చేరువ చేసింది. అదే విశ్వస‌నీయ‌త జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చేలా చేసింది. అలాంటి విశ్వస‌నీయ‌త‌ను సంపాయించు కోవడం రాజ‌కీయాల్లో ఉన్న వారికి ఎంత అవ‌స‌ర‌మో.. దానిని నిలుపుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. మ‌రి ఈ విష‌యంలో జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతున్నారు? ఏమేర‌కు ప్రజ‌ల్లో విశ్వసనీయ‌త‌ను చాటుకుంటున్నారు? అనేది ప్రధాన ప్రశ్న.రాజ‌కీయంగా దూకుడు చూపిస్తాన‌ని, మార్పు కోసం ప‌నిచేస్తాన‌ని, ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టాన‌ని చెప్పుకొంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఎవ‌రిని ప్రశ్నిస్తున్నారో..? ఎవ‌రిపై దూకుడు చూపిస్తున్నారో..? గ‌డిచిన ఐదేళ్లుగా ఏపీ ప్రజ‌లు చూశారు. 
కొత్త అనుమానాలతో జనసేనాని

ఇదే ఆయ‌న‌కు ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో పెను దెబ్బ కొట్టేలా చేసింది. మ‌రి దీని నుంచి ఆయ‌న నేర్చుకున్న పాఠాలు కూడా ఎక్కడా ఏమీ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో ఆరు మాసాలే అయింది. అయితే, ఈ ఆరు మాసాల్లోనే జ‌గ‌న్‌ ప్రభుత్వంపై ప‌వ‌న్ విమ‌ర్శలు ఎక్కుపెడుతున్నారు.వాస్తవానికి అధికార పార్టీపై ప్ర‌తిప‌క్షాలు చేయాల్సిన ప‌ని అదే అయినా.. శృతి మించి చేస్తున్న విమ‌ర్శలు, కామెంట్లు ప‌వ‌న్‌ కల్యాణ‌్ పై వ్యతిరేక భావ‌న‌ను పెంచుతున్నాయ‌నేది వాస్తవం అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ప‌వ‌న్‌ కల్యాణ‌్ చేసిన విమ‌ర్శల‌ను చూస్తే.. వైసీపీని నమ్మి ఓటు వేసినందుకు పింఛన్‌ కోసం ఎదురుచూ సే వృ ద్ధులు భారీగా నష్టపోయారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ ఎన్నికల హామీలో వృద్ధాప్య పెన్షన్‌ 2 వేల నుంచి 3 వేలకు పెంచుతామని చెప్పిందని గుర్తుచేశారు.‘పెన్షన్‌ అమలు లో వైసీపీ ప్రభుత్వం అంచెంచెలుగా మాట తప్పుతోందనాలా.. లేక మోసం చేస్తోందనుకోవాలా..’ అని ఇటీవల ట్విటర్‌లో అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెన్షన్‌ను రూ.2,250 మాత్రమే చేసిందని.. దీనివల్ల ప్రతి లబ్ధిదారూ నెలకు రూ.750 నష్టపోతున్నారని ప‌వ‌న్‌ కల్యాణ‌్ వ్యాఖ్యానించారు. కానీ, ఇక్కడే క‌మ్యూనిస్టుల‌కు కూడా రాని అనుమానాలు ప‌వ‌న్‌కు వ‌స్తున్నాయి. ఇదేనా నిబ‌ద్ధత‌తో కూడిన రాజ‌కీయం? అనే ప్రశ్న ఆయ‌న‌కు ఎదుర‌వుతోంది. ప్రభుత్వంపై ఓ ప్రతిప‌క్ష నాయ‌కుడిగా ప‌వ‌న్‌ కల్యాణ‌్ విమ‌ర్శలు చేయ‌డాన్ని అంద‌రూ స్వాగ‌తిస్తున్నారు. కానీ, ప‌స‌లేని విమ‌ర్శలు చేయ‌డాన్నే తిప్పికొడుతున్నారు.జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర స‌మ‌యంలో కానీ, త‌న మేనిఫెస్టోలో కానీ, పింఛ‌న్లను ఒకే సారి రూ.3000ల‌కు పెంచుతాన‌ని ఎక్కడా చెప్పలేదు. ద‌శ‌ల వారీగా పెంచుతూ పోతాన‌ని, ఐదేళ్లు గ‌డిచే స‌రికి రూ.3000ల‌కు పెంచుతాన‌ని ఆయ‌న చెప్పారు. ఇదే విష‌యాన్ని అసెంబ్లీలోనూ వీడియో వేసి మ‌రీ చూపించారు. అయినా కూడా ప‌వ‌న్‌ కల్యాణ‌్ ప‌స‌లేని విమ‌ర్శలు చేయ‌డం వ‌ల్ల ఆయ‌న‌పై ఉన్న కొద్దిపాటి న‌మ్మకాన్ని కూడా పోగొట్టుకున్న నాయ‌కుడిగానే మిగిలిపోయి.. ప‌వ‌న్‌ కల్యాణ‌్ క‌న్నా.. కామ్రెడ్లే బెట‌ర్ అని అనుకునే ప‌రిస్థితి రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

No comments:

Post a Comment