Breaking News

31/12/2019

33వ డివిజన్ లో సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు డిసెంబర్ 31 (way2newstv.in)
స్థానిక పొదలకూరు రోడ్డు ప్రాంతంలో ఉన్న 33 వ డివిజన్ సారాయి అంగడి సెంటర్లో గ్రామ సచివాలయ కార్యాలయాన్ని నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే నెల్లూరు గ్రామీణ నియోజవర్గ వర్గం లో ప్రతి విషయంలోనూ సచివాలయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 
33వ డివిజన్ లో సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కార దిశగా డివిజన్ ప్రజలకు సేవలందించిన గాను ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల నియామకం తో కొంతవరకు నిరుద్యోగ నిర్మూలన సాధ్యం అయిందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి  ఆశయసాధనకు దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి  రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ పరిధిలో అనేకమంది ప్రజలు వైకాపా తీర్థం పుచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. రానున్న స్థానిక, నగరపాలక ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించే దిశగా వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ బర్నబాస్, డి సి సి ఎం ఎస్ డైరెక్టర్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment