Breaking News

01/11/2019

హైద్రాబాద్ లో భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు

హైద్రాబాద్, నవంబర్ 1, (way2newstv.in)
హైద్రాబాద్ నగరంలో ఇళ్ల అమ్మకాల విలువ ఈ ఏడాది మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 31 శాతం తగ్గిపోయి, రూ.2,350 కోట్లకు పడిపోయింది. 2019 తొలి మూడు క్వార్టర్లకు సంబంధించిన ఇళ్ల అమ్మకాల డేటాను అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్  విడుదల చేసింది. ఈ  రిపోర్ట్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌లో ఇళ్ల అమ్మకాల విలువ మొత్తంగా తొలి మూడు క్వార్టర్‌‌‌‌‌‌‌‌లలో రెండు శాతం తగ్గిపోయి రూ.9,400 కోట్లుగా ఉన్నట్టు వెల్లడైంది. ఓ వైపు కన్జూమర్‌‌‌‌‌‌‌‌ సెంటిమెంట్‌‌‌‌ సరిగ్గా లేకపోయినా.. మూడు క్వార్టర్లలో టాప్ 7 సిటీల్లో ఇళ్ల అమ్మకాల విలువ మాత్రం 16 శాతం పెరిగినట్టు తెలిసింది. వీటి మొత్తం విలువ రూ.1.54 లక్షల కోట్లుగా ఉన్నట్టు అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌‌‌‌ రిపోర్ట్ పేర్కొంది.  
హైద్రాబాద్ లో భారీగా తగ్గిన  ఇళ్ల అమ్మకాలు

గతేడాది ఇదే కాలంలో మొత్తంగా రూ.1.33 లక్షల కోట్ల విలువైన యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయినట్టు అనరాక్‌‌‌‌ ఛైర్మన్ అనుజ్ పురి చెప్పారు. 2019 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఏడు నగరాల్లో మొత్తంగా 2.02 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయినట్టు ఈ రిపోర్ట్ తెలిపింది. గతేడాది ఇదే కాలంలో 1.78 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి.విలువ పరంగా చూస్తే.. ఇళ్ల అమ్మకాల్లో ఎంఎంఆర్(ముంబై మెట్రోపాలిటన్ రీజన్) టాప్‌‌‌‌లో నిలిచింది. 2019 తొలి మూడు క్వార్టర్‌‌‌‌‌‌‌‌లలో ఎంఎంఆర్‌‌‌‌‌‌‌‌లో రూ.62,970 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత బెంగళూరులో రూ.28,160 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఇళ్ల అమ్మకాల విలువలో ఎంఎంఆర్‌‌‌‌‌‌‌‌ వార్షికంగా 33 శాతం వృద్ధిని నమోదు చేసింది. బెంగళూరు ఇళ్ల అమ్మకాల విలువ మాత్రం ఏడు శాతం తగ్గింది.  గతేడాది బెంగళూరులో రూ.30,310 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఆశ్చర్యకరంగా పుణే మొత్తం ఇళ్ల అమ్మకాల విలువలో ఈ ఏడాది తొలి మూడు క్వార్టర్‌‌‌‌‌‌‌‌లలో 32 శాతం జంప్ చేసి రూ.17,530 కోట్లుగా ఉంది. 2018 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పుణేలో రూ.13,275 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయని పురి తెలిపారు. 2019లో పుణేలో 31,380 ఇళ్లు అమ్ముడుపోయినట్టు చెప్పారు. ఢిల్లీలో హౌసింగ్ సేల్స్ విలువ ఈ ఏడాది తొలి మూడు క్వార్టర్‌‌‌‌‌‌‌‌లలో రూ.24,860 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే.. 15 శాతం ఎక్కువ. ఇటీవల కాలంలో రెసిడెన్షియల్ మార్కెట్స్‌‌‌‌ ఎక్కువగా దెబ్బతిన్న మార్కెట్‌‌‌‌లో ఢిల్లీ ఒకటిగా ఉందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ పేర్కొంది. చెన్నైలో ఇళ్ల అమ్మకాల విలువ రూ.5,580 కోట్లుగా, కోల్‌‌‌‌కతాలో రూ.5,850 కోట్లుగా ఉన్నాయి. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 13 శాతం పెరిగినట్టు రిపోర్ట్ వెల్లడించింది. అయితే టాప్ 7 సిటీలతో పోలిస్తే చెన్నైలోనే అత్యంత తక్కువ విలువైన ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.2019లో మొత్తంగా మూడు క్వార్టర్స్‌‌‌‌లో కూడా చివరి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ వరస్ట్ సేల్స్ పర్‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్‌‌‌‌ను నమోదు చేసింది. గతేడాది క్యూ3లో రూ.50,535 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగితే.. ఈ ఏడాది క్యూ3లో రూ.42,040 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. వార్షికంగా 17 శాతం తక్కువగా ఉన్నాయి. క్యూ3లో మొత్తం ఇళ్ల అమ్మకాల విలువలో బెంగళూరులో ఎక్కువగా 35 శాతం తగ్గిపోయాయి. ఆ నగరంలో మొత్తంగా అమ్ముడుపోయిన ఇళ్ల అమ్మకాల విలువ రూ.7,540 కోట్లుగా ఉంది. ఎంఎంఆర్‌‌‌‌‌‌‌‌లో రూ.17,300 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. గతేడాదితో పోలిస్తే వార్షికంగా ఏడు శాతం తక్కువ. పుణేలో హౌసింగ్ సేల్స్‌‌‌‌ ఈ క్యూ3లో రూ.4,775 కోట్లుగా ఉన్నాయి. గతేడాది క్యూ3లో పుణేలో రూ.5,035 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగాయి.  ఢిల్లీలో 13 శాతం తగ్గిపోయి రూ.7,775 కోట్లుగా ఉన్నాయి. చెన్నై, కోల్‌‌‌‌కతాలో ఇళ్ల అమ్మకాల విలువ 10 శాతం, 29 శాతం తగ్గిపోయినట్టు అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ రిపోర్ట్‌‌‌‌  వెల్లడించింది. ఈ ఏడాది క్యూ3లో చెన్నైలో మొత్తం ఇళ్ల అమ్మకాల విలువ రూ.1,620 కోట్లుగా, కోల్‌‌‌‌కతాలో రూ.1,710 కోట్లుగా ఉన్నట్టు అనరాక్ రిపోర్ట్ తెలిపింది.

No comments:

Post a Comment