Breaking News

05/11/2019

పీకల్లోతు కష్టాల్లో క్యాబ్ డ్రైవర్లు

హైద్రాబాద్, నవంబర్ 5, (way2newstv.in)
ఇటీవల కాలం ఐదుగురు క్యాబ్ డ్రైవర్లు ఆత్మహత్యకు యత్నించడం జరిగిందంటే సమస్య ఎంత జఠిలంగా ఉందో అర్ధం అవుతోంది. ఇటు ఆదాయం రాక అటు ఫైనాన్స్ కట్టలేక మరికొంత మంది క్యాబ్ డ్రైవర్లు కొట్టుమిట్టాడుతున్నారు. నగరంలో సుమారు70 వేలకు పైగా క్యాబ్‌లు తిరుగుతున్నాయి. కొంత మంది నిరుద్యోగులు స్వగ్రామంలో ఆస్తులు అమ్మికుని వీటిని కోనుగోలు చేస్తుంటే, మరి కొందరు అప్పులు చేసి వీటిని కొనుగోలు చేస్తున్నారు.వేలతో రండి.. లక్షలు సంపాదించండి.. కేవలం రూ.30 వేలు చెల్లించి నెలకు 1 లక్ష రూపాయలు సం పాదించండి.. కేవలం  రూ. 30 వేలతో కారు  మీ సొంతం చేసుకోండి. వంటి ప్రకటలతో పలు సంస్థలు నిరుద్యోగులకు వల విసురుతుండటం తో  ఆ వలలో చిక్కిన  నగరంలోని అనేక మంది క్యాబ్ డ్రైవర్లు సతమతం అవుతున్నారు. 
పీకల్లోతు కష్టాల్లో క్యాబ్ డ్రైవర్లు

చివరకు ఆయా సంస్థలు పెట్టే నిబంధనలు పాటించలేక… సరైనా ఆదాయం లేక కనీసం  ఫైనాన్స్ సంస్థలకు ఇన్‌స్టాల్‌మెంట్ కూడా కట్టలేక పోవడంతో చివరకు వాటిని ఫైనాన్న్ సంస్థలకు  స్వాధీనం చేసుకుని వేలం వేస్తున్నాయి. మరి కొందరు క్యాబ్ డ్రైవర్లు  అప్పుల ఊబినుంచి బయట పడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా అనేక ఉన్నాయి. ఆటోల కొనుగోళ్లుకు  ప్రభుత్వం అనేక అనుమతులు విధించడం. చివరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే నాటికి ఆటో డీలర్లు  కుమ్మక్కై  వాటిని బ్లాక్‌లో   సుమారు 2 లక్షల 50 వేలకు కొనుగోలు చేయాల్సి రావడంతో వారు కూడా వీటిపై దృష్టి పెడుతూ నష్టపోతున్నారు.పీక్ అవర్ లేకుండా మినిమం టారిఫ్‌తో కూడిన వ్యాపారం ఇవ్వాలని, ప్రతి వాహనానికి బిజినస్ గ్యారంటీని 5 సంవత్సరాల వరకు ఒకే స్కేల్ విధానం ఉండాలని, మినీ,సెడాన్ వాహనాలకు ప్రత్యేక రేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా కస్టమర్స్ పికప్ లోకేషన్స్ 2 కిలో మీటర్లలోపు ఉండాలని, కస్టమర్స్ బిగినింగ్స్ క్యాన్సిల్ చేస్తే దానికి డ్రైవర్‌ను బాధ్యులు చేయవద్దన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో వాహనాలకు  12 గంటల ప్యాకేజి ఇవ్వాలని, డ్రైవర్స్‌కు 24గంటల కాల్ సెంటర్ సర్వీసు ఉండాలని, ఆన్‌డ్యూటీలో ఉన్న డ్రైవర్స్ ఎటువంటి ఇబ్బందులు కలిగినా కంపెనీ బాధ్యత వహించాలని డిమాం డ్ చేశారు. ఓలా,  ఉబర్ కంపెనీలు కొత్తవి బయటకు తేకుండా ఉన్న వారికే బుకింగ్స్  ఇచ్చి ఆదుకోవాలని  ఈ అంశంలో ప్రభు త్వం జోక్యం చేసుకుని సమస్యల పరిష్కరించాలని కోరుతున్నారు.క్యాబ్‌లు నడిపే డ్రైవర్లు ముందుగా సంస్థతో సరైన ఒప్పందం చేసుకోవాలంటున్నారు. కొన్ని సంస్థలు ఇన్సెంటివ్ పేరిట 18 గంటలు శ్రమించాల్సి వస్తోందని, వాటిని ఇవ్వకుండా చేసేందుకు సాంకేతిక సమస్యలను సాకు చూపుతూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని  యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రిప్ టైమ్ ఛార్జెస్  డ్రైవర్లకు ఇవ్వాలని, అన్ని కంపెనీలు ఒక రేటు నిర్ణయించి  అదే రేటు ప్రకారం చేయాలని, మొదట ప్రకటించిన విధంగానే అన్ని కార్పొరేట్ సంస్థ ప్రోత్సహకాలను పొడగించాలని, ప్రతి వాహనాన్ని ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారో అన్ని సంవత్సరాలకు అగ్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి బుకింగ్ పైసలు వెంటనే ఓనర్ కమ్ డ్రైవర్ అకౌంట్‌లో జమకావాలని, తప్పుడు బుకింగ్స్‌కు ఆ కంపెనీ బాధ్యత వహించి దానికి నష్టపోయిన పరిహారాన్ని సదరు కంపెనీలే భరించాలని, ఐటీ కంపెనీలలో సబ్ వెండర్ వ్యవస్థను  రద్దు చేసే నేరుగా వెండర్ పేమెంట్ ఇవ్వాలని  డిమాండ్ చేస్తున్నారు.కొన్ని సంస్థలు   ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా ఒక్కో డ్రైవర్ 24 గంటలు పని చేసినా సరయిన  బుకింగ్స్ ఇవ్వకుండా ఆయా  కం పెనీలు సొంతంగా వారే క్యాబ్స్ డ్రైవర్స్ నుంచి రూ.30 వేలు తీసుకుని ప్రతి నెలా రూ. 26 వేలు చొప్పున నాలుగు సంవత్సరాలు కట్టించుకుని నిలువు దోపిడీ చేస్తున్నారని వారు వాపోతున్నారు.

No comments:

Post a Comment