Breaking News

07/11/2019

కొత్త నేతలతోనే ఫ్యాన్ కు తంటా

విజయవాడ, నవంబర్ 7  (way2newstv.in)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే వ్యవహరిస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరచూ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలసి వస్తున్నారు. తమ రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా వినతులు సమర్పించడంతో పాటుగా తాను మీ మనిషినేనన్న సంకేతాలు ఇచ్చి వస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సయితం ముఖ్యమంత్రి జగన్ కు అడిగినప్పుడల్లా అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. భుజం తట్టి మరీ పంపుతున్నారు.కానీ రాష్ట్రానికి వచ్చే సరికి బీజేపీ నేతల స్వరం మారుతుంది. పక్కా విపక్షంలా వ్యవహరిస్తుంది. నిజమే అధికార పార్టీతో అంటకాగితే ఆ పార్టీ ఎలా నిలబడుతుందన్నది రాష్ట్ర నేతల భయం కావచ్చు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. 
కొత్త నేతలతోనే ఫ్యాన్ కు తంటా

ముఖ్యంగా జగన్ పాలనపై మండి పడుతున్నారు. జగన్ పాలన అంటేనే జనం భయపడుతున్నారని సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హార్డ్ కామెంట్స్ చేశారు.అలాగే కొత్తగా బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఆయన సహజంగానే వైసీపీ మీద విరుచుకుపడతారు. ఇప్పటి వరకూ కేంద్ర పెద్దలెవరూ వైసీపీపై విమర్శించిన దాఖలాలు లేవు. రాష్ట్ర పార్టీని కంట్రోల్ చేయడానికి జగన్ ఇటీవల ప్రయత్నించారు. ఆంధ్ర్రప్రదేశ్ లో అమలు చేయనున్న వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిం చాల్సిందిగా స్వయంగా జగన్ ప్రధాని మోడీని ఆహ్వానించారు. అయితే రాష్ట్ర నాయకత్వం ఒత్తిడితో మోడీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో జగన్ ప్లాన్ అమలు కాలేదు.ఇక బీజేపీలోని సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వంటి ఒరిజినల్ బీజేపీ లీడర్లు వైసీపీ ప్రభుత్వం పట్ల కొంత సానుకూలంగానే ఉండటం విచిత్రంగా కన్పిస్తుంది. ఎటొచ్చీ పార్టీలో నిన్నమొన్న చేరిన నేతలే జగన్ సర్కార్ ను ఇరకాటంలో నెడుతున్నారు. అందుకే ఇటీవల విజయసాయిరెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. రాష్ట్ర నాయకత్వం తప్పుడు దారిలో నడుస్తుందన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తమను ఏమీ అనడం లేదని, కేంద్ర ప్రభుత్వం కూడా తమకు అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తం మీద బీజేపీలో ఒరిజినల్ కన్నా డూప్లికేట్లతోనే అసలు సమస్య అని వైసీపీ గుర్తించింది. మరి బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది

No comments:

Post a Comment