రాజమహేంద్రవరం నవంబర్ 22 (way2newstv.in)
రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ స్థానిక 49వ డివిజన్లో శుక్రవారం పర్యటించారు. డివిజన్లో పర్యటించి స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా, ప్రమాద కరంగా ఉన్న విద్యుత్ స్తంబాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరం పరిష్కరించాలని సూచించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో ముందుంటాం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
అలాగే డివిజన్‌లో నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో తమేప్పుడు ముందుంటామన్నారు. ఏ సమస్య ఉన్నా... ఏ సమయంలోనైనా తమకు చెప్ప వచ్చన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ నిత్యం తాము ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. స్థానిక నాయకులు నేమాలి శ్రీనివాస్, నేమాలి వేణు, కొమ్మన సత్తిబాబు, పడాల సీతారామయ్య, గుర్రాల రమణ, నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ అధికారులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
No comments:
Post a Comment