Breaking News

08/11/2019

ఏసీబీకి వలలో మహిళా తాహశిల్దార్….

కర్నూలు నవంబర్ 8, (way2newstv.in)
కర్నూలు లో లంచగొండి తహశిల్దార్ ఏపీబీకి దొరికిపోయిన ఉదంతం కలకలం రేపింది. భూ సమస్య పరిష్కారం కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు  గూడూరు తహసిల్దార్ హసీనా బి.  గూడూరు చెందిన సురేష్ అనే వ్యక్తి తన భూ సమస్య పరిష్కారం కోసం తాసిల్దార్ హసీనా బి ని నెల క్రితం కార్యాలయంలో సంప్రదించాడు. అయితే  భూ సమస్య పరిష్కారం కోసం తనకు రూ.4 లక్షలు లంచం గా ఇవ్వాలని తాహసిల్దార్ డిమాండ్ చేశారు.  దీంతో కలత చెందిన సురేష్ ఏసీబీని ఆశ్రయించాడు. 
ఏసీబీకి వలలో మహిళా తాహశిల్దార్….

ఆ తర్వాత తహశీల్దార్ కోరిన మేరకు రూ. 4 లక్షలు తీసుకొని గురువారం రాత్రి పాణ్యం బస్ స్టాండ్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే తాసిల్దార్ తాలూకు చెందిన మహబూబ్ భాష అనే వ్యక్తి సురేష్ నుంచి సొమ్ము తీసుకునే యత్నంలో ఉండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మహబూబ్ భాషను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసిల్దార్ ఆదేశించిన మేరకు ఆ సొమ్మును తీసుకునేందుకు వచ్చినట్లు మహబూబ్ బాషా ఏసీబీ అధికారులకు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత తాసిల్దార్ హసీనా బి ని అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు యత్నించగా విషయం తెలుసుకున్న ఆమె అప్పటికే పరారైనట్లు అధికారులు తెలిపారు. గతంలో ఈమె నంద్యాల డిప్యూటీ తాసిల్దార్ గా కూడా పని చేశారు.

No comments:

Post a Comment