Breaking News

28/11/2019

బీజేపీతో పవార్ ఢీ

ముంబై, నవంబర్ 28 (way2newstv.in)
శరద్ పవార్ తాను అనుకున్నది సాధించారు. ఒకరకంగా రాజకీయంగా, కుటుంబ పరంగా కూడా విజయం సాధించారు. శరద్ పవార్ అమలు చేసిన వ్యూహాలు ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా ఆయన తానేంటో స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా రెండు విధాలుగా లాభ పడింది శరద్ పవార్ అనే చెప్పాలి. మహారాష్ట్రలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ శరద్ పవార్ పేరు మారుమోగిపోతుంది. బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పవర్ ప్లే లో సిక్సర్ల మోత మోగించారు.శరద్ పవార్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక లెజెండ్. మోదీ, అమిత్ షాలకు ధీటుగా ఏ రాష్ట్రంలో లేని విధంగా బీజేపీకి శరద్ పవార్ ఎదురొడ్డి నిలిచారు. 
బీజేపీతో పవార్ ఢీ

శివసేనను అండగా ఉంచుకుని శరద్ పవార్ చెలరేగి పోయారు. బీజేపీని మాత్రమే కాకుండా మోదీ, షాలకు వ్యక్తిగతంగా ఇది అవమానకరమే. దీనికి బదులు వారు తీర్చుకుంటారా? లేదా? అన్నది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు శరద్ పవార్.ప్రధానంగా సోనియా గాంధీ వద్ద మంచి మార్కులు కొట్టేశారు. చేజారిపోతుందనుకున్న అతి పెద్ద రాష్ట్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో శరద్ పవార్ చూపిన పరిణితిని సోనియాగాంధీ సయితం కొనియాడారు. తొలుత శరద్ పవార్ ను కాంగ్రెస్ అనుమానించింది. అజిత్ పవార్ వెళ్లిపోవడం వెనక శరద్ పవార్ హస్తం ఉందని డౌటుతో కొందరు కాంగ్రెస్ నేతలు శరద్ పవార్ ను టార్గెట్ గా చేసుకుని కామెంట్స్ కూడా చేశారు. అయినా శరద్ పవార్ తనకేమీ తెలియదన్నట్లుగానే వ్యవహరించారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి పార్టీలన్నీ శరద్ పవార్ ను హీరోగా చూస్తున్నాయి.ఇక కుటుంబ పరంగా కూడా శరద్ పవార్ విజయం సాధించినట్లే. తన కుమార్తె సుప్రియా సూలెను రాజకీయ వారసురాలిగా చేయాలనుకుంటున్నారు. కానీ అజిత్ పవార్ పార్టీలో బలమైన నేతగా మారారు. అజిత్ పవార్ ను అభిమానించే వారు పార్టీలో అనేక మంది ఉన్నారు. అందుకే సుప్రియాసూలేను పార్లమెంటుకు పంపారు. అయితే ఎప్పటికైనా రాష్ట్రంలో తన వారసత్వాన్ని సుప్రియా కు అప్పగించాలని యోచిస్తున్న శరద్ పవార్ కు అజిత్ పవార్ తనంతట తానే ఛాన్సిచ్చారు. ఇటు అజిత్ పవార్ ను తిరిగి పార్టీలోకి రప్పించడంలో సఫలమయ్యారు. అజిత్ పవార్ తిరిగి పార్టీలోకి వచ్చినా ఆయనకు గతంలో ఉన్న ప్రయారిటీ ఉండదు. ఎమ్మెల్యేలు కూడా అంత తొందరగా అజిత్ ను నమ్మరు. ఈ నాలుగురోజుల్లో సుప్రియా పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు దగ్గరయ్యారు. సో… శరద్ పవార్ ఇటు పార్టీలోనూ తన కుమార్తె పట్టును పెంచుకోగలిగారు. తన వారసురాలు సుప్రియా అని చెప్పకనే చెప్పినట్లయింది.

No comments:

Post a Comment