Breaking News

29/11/2019

రన్నింగ్ లోకి వచ్చిన హైటెక్ సిటీ మెట్రో

హైద్రాబాద్, నవంబర్ 29 (way2newstv.in)
హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు మరింత విస్తరించాయి. ఐటీ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ-రాయదుర్గం మార్గాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 10.15 గంటలకు ఫ్రారంభించారు. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు మరో మంత్రి అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ప్రయాణించారు. ఈ రెండు స్టేషన్ల మధ్య ఒకటిన్నర కిలోమీటర్ల దూరం కాగా, ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రయాణికులను అనుమతించనున్నారు. దీంతో నాగోల్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు నడిచే మెట్రో రైలు... మైండ్‌ స్పేస్‌ వరకు అందుబాటులోకి వచ్చింది.ఈ స్టేషన్లలో మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ జామ్‌ నుంచి ఊరట కలిగింది. 
రన్నింగ్ లోకి వచ్చిన హైటెక్ సిటీ మెట్రో

రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం 10గంటల 15 నిమిషాలకు దీనిని ప్రారంభిస్తారు.ఇప్పటివరకు 56 కిలోమీటర్ల మార్గంలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా, దీనికి మరో కిలోమీటరున్నర పెరిగింది.సరిగ్గా రెండేళ్ల కిందట నాగోల్- అమీర్‌పేట్‌- మియాపూర్ మార్గంలో తొలిసారిగా మెట్రో పరుగులు పెట్టింది. ఆ తర్వాత అమీర్‌పేట-ఎల్బీనగర్‌, ఈ ఏడాది మార్చిలో అమీర్‌పేట్ - హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం మధ్య ఒకటే స్టేషన్‌.. అయినా కారిడార్‌-3లో ఇది కీలకం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు ఉండగా, వీటిలో లక్షలాది మంది పనిచేస్తున్నారు.వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీ వరకు ప్రస్తుతం మెట్రోలో వస్తున్న ఉద్యోగులు దుర్గం చెరువు, హైటెక్‌సిటీ స్టేషన్ల వద్ద దిగి మైండ్‌స్పేస్‌తో పాటు ఇతర ఆఫీసులకు షటిల్‌ బస్సులు, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. కేవలం ఐదు నిమిషాల ప్రయాణానికి ట్రాఫిక్‌లో అరగంట గడపాల్సి వస్తోంది. రాయదుర్గం స్టేషన్‌ అందుబాటులోకి రావడం ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్‌ నుంచి పెద్ద ఊరట లభించినట్టయ్యింది. మెట్రో తొలిదశలో కారిడార్‌-3ని నాగోల్‌ నుంచి శిల్పారామం వరకు చేపట్టాలని ప్రతిపాదించారు. శిల్పారామం వద్ద స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని భావించారు.అయితే, చెరువు ప్రాంతం కావడంతో భూసార పరీక్ష అనంతరం సాంకేతికత కారణాలతో మార్పులు చేశారు. హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు కారిడార్‌ను పొడిగించారు. సైబర్‌గేట్‌వే వద్ద ఒక స్టేషన్‌, బయోడైవర్సిటీ సమీపంలో మరో స్టేషన్‌ను ప్రతిపాదించారు. కానీ, ఎస్‌ఆర్‌డీపీలో మైండ్‌స్పేస్‌ వద్ద అండర్‌పాస్‌, ఫ్లైఓవర్ నిర్మాణం జరగడంతో మెట్రో అలైన్‌మెంట్‌ మరోసారి మారింది. సైబర్‌ గేట్‌వే, రాయదుర్గం రెండు స్టేషన్ల స్థానంలో మైండ్‌స్పేస్‌ జంక్షన్ ముందు లెమన్‌ట్రీ హోటల్‌ వద్ద ఒక స్టేషన్‌ను ఖరారు చేశారు. దీనికే రాయదుర్గం స్టేషన్‌ పేరు పెట్టారు.

No comments:

Post a Comment