Breaking News

11/11/2019

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం

నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ గారు
నందికొట్కూరు నవంబర్ 11, (way2newstv.in)
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి "మౌలానా అబుల్ కలాం అజాద్ " దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యుడు  తొగురు ఆర్థర్ అన్నారు. సోమవారం జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం అజాద్  131వ జయంతిని పురష్కరించుకొని నందికొట్కూరు పట్టణంలోని మిడుతూరు రోడ్డు కాలేజీ సర్కిల్  నందు మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 
 మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 10 ఏళ్ల పాటు మౌలానా అబుల్ కలాం జైలు జీవితాన్ని గడిపారని అన్నారు. మహనీయుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. నందికొట్కూరు పట్టణంలో షాదిఖానా నిర్మాణానికి రూ.1.50కోట్లు, నియోజకవర్గంలోని 114 మసీదుల మరమ్మతులకు ఒక్కొక్కదానికి రూ.15వేల చొప్పున నిధులు మంజూరు చేశానని స్పష్టం చేశారు. అనంతరం నందికొట్కూరు పట్టణంలో ఉర్దూ జూనియర్ కళాశాల, స్మశాన వాటిక, ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే కు  విన్నవించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వాటి మంజూరికి హామీ ఇచ్చారు. అలాగే వ్యాస రచన పోటీలో పాల్గొని  విజేత లైన విద్యార్దిని విద్యార్దల కు బహుమతులు అందచేశారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు అబ్దుల్ సుకూరు  చెరుకు జిల్లా సుధాకర్ రెడ్డి సీఐ, పట్టణ మైనారిటీ నాయకులు, విద్యార్ధులు, ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment