న్యూఢిల్లీ, నవంబర్ 20 (way2newstv.in)
కేంద్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించేందుకు సిద్ధమౌతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సంఘటిత రంగ ఉద్యోగులు, కార్మికులు అందరికీ ఒకే రోజున వేతనాలు అందించాలని యోచిస్తోంది. దీని కోసం ‘ఒకే దేశం.. ఒకే రోజు వేతనం’ అనే విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది.కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఈ విషయాన్ని తెలియజేశారు. ‘దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని కార్మికులకు ప్రతి నెలా ఒకే రోజు వేతనం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం.
దేశమంతా ఒకే రోజు జీతాలు
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని వివరించారు. త్వరలోనే ఈ విధానానికి ఆమోదం లభించొచ్చని తెలిపారు.అంతేకాకుండా వివిధ రంగాల్లో మినిమమ్ శాలరీ అంశంపై కూడా చర్చిస్తున్నామరి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఒకే రకమైన నిబంధనలు తీసుకువస్తామని పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు ప్రయోజనం లభిస్తుందని తెలిపారు.మోదీ సర్కార్ ఆక్యూపెషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ (ఓఎస్‌హెచ్) కోడ్, కోడ్ ఆన్ వేజెస్‌లను అమలు చేుయాలని భావిస్తోంది. పార్లమెంట్ ఇప్పటికే కోడ్ ఆన్ వేజెస్‌కు ఆమోదం తెలిపింది. ఇంకా అమలులోకి రాలేదు. దీంతో కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది.
No comments:
Post a Comment