Breaking News

05/11/2019

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలి

మహబూబాబాద్ నవంబర్ 5 (way2newstv.in)  
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో గిరిజన,మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మంగళవారం తో ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ముగుస్తుంది కాబట్టి వెంటనే కార్మికులు విధుల్లో చేరాలని సూచించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ చాలా సార్లు డెడ్ లైన్ పెట్టారన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదని యూనియన్ నాయకుల ఉచ్చులో పడవద్దన్నారు. 
ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలి

తెలంగాణ లో 91 కార్పొరేషన్లు ఉన్నాయని,ఒక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అనేక సమస్యలు వస్తాయన్నారు. 5100 బస్సులను ప్రయాణికులు ఇబ్బందులు పడవద్దని ప్రైవేట్ పరం చేశారు. ప్రజల మద్దతు ఆర్టీసీ కార్మికులకు లేదు అనడానికి ఒక నిదర్శనం హుజూర్నగర్ ఎన్నికలలో టిఆర్ఎస్ అధికారంలోకి రావడం అన్నారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత,జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు,పర్కాల శ్రీనివాస్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషా,జెడ్పిటీసీలు, ఎంపీపీ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment