కేంద్ర హోం మంత్రి అమిత్ షా
న్యూ ఢిల్లీ నవంబర్ 20, (way2newstv.in):
దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. అస్సాంలో నిర్వహించిన ఎన్ఆర్సీ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్సీ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. వివిధ మతాలకు చెందిన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ చేపడతాం
పౌరుల జాబితాలో ప్రతి ఒక్కరూ ఉండే విధంగా ఎన్ఆర్సీ ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు. అస్సాంలో మరో సారి ఎన్ఆర్సీ చేపడుతామని, వివిధ మతాలకు చెందిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అస్సాంలో రిలీజైన సిటిజన్స్ జాబితా నుంచి 19 లక్షల మందిని తప్పించిన విషయం తెలిసిందే. పేర్లు లేని వారు ట్రిబ్యునల్కు వెళ్ల వచ్చు అని మంత్రి తెలిపారు.
No comments:
Post a Comment