Breaking News

20/11/2019

ఎన్టీఆర్ బయోపిక్ లో జూనీయర్‌

హైద్రాబాద్, నవంబర్ 20  (way2newstv.in)
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, బాబాయ్‌ నందమూరి బాలకృష్ణకు షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావు జీవితకథను బయోపిక్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రిలీజ్‌ అయిన ఈ సినిమాలు బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడ్డాయి. దీంతో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య సూట్‌ కాలేదన్న టాక్‌ కూడా వినిపించింది.అయితే తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్‌ను తలైవీ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎంజీ రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటిస్తుండగా కరుణానిధిగా ప్రకాష్ రాజ్‌ నటిస్తున్నాడు. 
ఎన్టీఆర్ బయోపిక్ లో జూనీయర్‌

అయితే సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌ పాత్ర కూడా కనిపించనుంది.ఈ పాత్రలో బాలయ్య నటిస్తున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్యకు బదులుగా ఎన్టీఆర్‌ పాత్రకు జూనియర్‌ ఎన్టీఆర్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్‌. ఎన్టీఆర్‌ తాత పాత్రలో నటించేందుక అంగీకరిస్తే భారీ పారితోషికం ఇచ్చేందుకు కూడా రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఒక్క సీన్‌లో కనిపించినా తెలుగు వర్షన్‌కు మంచి బిజినెస్‌ జరుగుతుందని టాక్‌ వినిపిస్తోందఅయితే గతంలో మహానటి సినిమా సమయంలోనూ ఎన్టీఆర్‌ను తాత పాత్రలో నటింప చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పట్లో ఎన్టీఆర్‌ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. మరి ఇప్పుడు తలైవీ టీం ఇదే ప్రపోజల్‌ పెడితే యంగ్‌ టైగర్‌ ఓకే చెప్తాడా అన్న టాక్‌ వినిపిస్తోంది.ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్‌ బయోపిక్‌ను నిర్మించి విష్ణు ఇందూరి ఈ బయోపిక్‌ను కూడా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించారు.

No comments:

Post a Comment