Breaking News

29/11/2019

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

హైదరాబాద్ నవంబర్ 29, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది.  ఎలక్ట్రానిక్స్ కంపెనీ  స్కైవర్త్ తన ఉత్పత్తుల తయారీకి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ  మంత్రి కేటీఆర్ తో  స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ మిస్టర్ లై వీడ్ భేటీ కావడం జరిగింది. రాష్ట్రంలో తమ ఉత్పత్తులకు సంబంధించి స్కైవర్త్ లీడర్షిప్ యొక్క ఉన్నత ప్రతినిధి బృందం మరియు ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో హైదరాబాద్ లో  జరిగిన సమావేశంలో ఐటి మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ మిస్టర్ లై వీడ్ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. స్కై వర్త్ కంపెనీ తెలంగాణాలో తమ ఉత్పత్తుల తయారీకి సంబంధించి దశల వారీగా పెట్టుబడులను పెట్టనుంది. 
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

ఇందులో భాగంగా మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా రూ 700 కోట్లతో 50 ఎకరాలలో  అత్యాధునిక ఉత్పాదక ప్లాంటును  ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రంగ పెట్టుబడి ఇది. దీంతోపాటు దేశంలోకి వచ్చిన అతిపెద్ద చైనీస్ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల్లో ఇది ఒకటిగా నిలవనున్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్ & మెట్జ్ బ్రాండ్ ఎల్ఈడి టీవీలు ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్నాయి. దాని రెండవ దశ విస్తరణలో ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే తాజా తరం లిథియం బ్యాటరీల తయారీ, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషీన్ల తయారీని చేర్చడం జరుగుతుంది.ఈ సందర్భంగా బోర్డు ఛైర్మన్ మిస్టర్ లై వీడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు అనుగుణంగా ఉన్నాయని, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను లభిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం అన్నారు. స్కై వర్త్ ద్వారా అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు తీసుకురానుందని. స్థానిక ప్రజల నైపుణ్యాలను పెంచడనికి స్కైవర్త్  పనిచేస్తున్నదని తెలిపారు.ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ వాంగ్ జెంజున్ మాట్లాడుతూ.. స్కైవర్త్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా భారతదేశం చాలా వ్యూహాత్మక మార్కెట్ అని స్కైవర్త్ & మెట్జ్ యొక్క నాణ్యత, భారతీయ వినియోగదారుల నుండి మంచి ఆదరణ పొందడం జరిగిందని తెలిపారు. స్కైవర్త్ భారతీయ మార్కెట్లలో దశలవారీగా గణనీయమైన పెట్టుబడులు పెట్టడం కొనసాగుతుందని తెలిపారు.  స్కైవర్త్  హైదరాబాద్ను తన ఉత్పాదక గమ్యస్థానంగా ఎంచుకున్నదని, ఇది ఐదువేల మందికి పైగా ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుందని తెలంగాణ ప్రభుత్వ ఐటి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇండస్ట్రీ ప్రోయాక్టివ్ అని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం టిఎస్-ఐపాస్ వంటి విప్లవాత్మక చర్యలతో వివిధ కంపెనీలు పెట్టుబడులకు తెలంగాణకు గమ్య స్థానముగా మార్చుకుంటున్నాయని తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో పాటు అత్యుత్తమ శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు మరియు అద్భుతమైన జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాంతాలతో హైదరాబాద్ నగరానికి ఉన్న కనెక్టివిటీ నగరంలో పారిశ్రామిక పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా మారుస్తున్నదని తెలిపారు. స్కైవర్త్ హైదరాబాద్లో తయారీకి ఎంచుకున్నందుకు స్కైవర్త్ బోర్డు చైర్మన్ మరియు ఆయన బృందానికి మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ భారీ పెట్టుబడితో మర్నిన్ని కంపెనీలు తెలంగాణకు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి, టియస్ ఐఐసి ఎండీ నర్సింహ రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment