`డాన్‌శీను`, `బలుపు` వంటి రెండు సెన్సేషనల్ హిట్ చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `క్రాక్`. పవర్‌ఫుల్ టైటిల్, రవితేజ మాస్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.
ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుండి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. రవితేజ, శృతిహాసన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
రామోజీ ఫిలింసిటీలో మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్, గోపీచంద్ మలినేని, ఠాగూర్ మధుల `క్రాక్` రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.కోలీవుడ్ యాక్టర్స్ వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని ఇందులో పవర్‌ఫుల్ పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి `మెర్సల్`, `బిగిల్` వంటి సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
నటీనటులు:
రవితేజ, శృతిహాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్ జాని తదితరులు
No comments:
Post a Comment