Breaking News

19/11/2019

శివసేన ఎగ్జిట్ పై బీజేపీ లైట్

ముం బై, నవంబర్ 19 (way2newstv.in)
శివసేన కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకుంది. ఎన్డీఏ నుంచి వైదొలిగింది. ఎన్డీఏ సమావేశానికి కూడా అది గైర్హాజరు కావడంతో శివసేన ఇక బీజేపీతో కలవదని తేలిపోయింది. మరోవైపు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయింది. అయితే బీజేపీ కూడా తాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో ఎలా సాధ్యమన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బీజేపీ శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు కలిస్తే మ్యాజిక్ ఫిగర్ కు సులువుగా చేరుకుంటుంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 144. అయితే బీజేపీకి ఆ మ్యాజిక్ ఫిగర్ ఒంటరిగా చేరుకోలేదు. 
శివసేన ఎగ్జిట్ పై బీజేపీ లైట్

స్వతంత్ర సభ్యులు మద్దతిచ్చినా బీజేపీ సంఖ్య 118కి మించదు. దీంతో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయలేదు. మరి బీజేపీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటన ఎందుకు చేసినట్లు అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.ఒకటి బీజేపీ కర్ణాటక తరహాలో వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనకు చెందిన కొందరు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తే మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునే అవకాశముంటుంది. అయితే కర్ణాటకలో 14 నెలల తర్వాత గాని బీజేపీికి ఈ వ్యూహం వర్క్ అవుట్ కాలేదు. ఎన్నికలు జరిగి నెల కూడా గడవక ముందే ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి ముందుకు వస్తారా? అన్నది ప్రధాన ప్రశ్న. ఇది సాధ్యం కాదనేది రాజకీయ పండితుల అంచనా.ఇక బీజేపీ మరో ఆప్షన్ ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి నేరుగా చేర్చుకోవడమే. శివసేన బలమైన పార్టీ కాబట్టి ఆ పార్టీ నుంచి వలసలు ఉండకపోవచ్చు. ఇక మంత్రి పదవులు ఎరవేస్తే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే ఎక్కువగా జంపింగ్ లు ఉండే అవకాశముందని ఆ పార్టీ నేతలకు అనుమానమే. అందుకే కాంగ్రెస్, ఎన్సీపీలలో బీజేపీ ఈ ప్రకటన తర్వాత కొంత ఆందోళన కన్పిస్తుంది. ఎన్నికలకు ముందు కూడా ఈ పార్టీల నుంచే ఎక్కువ మంది బీజేపీలో చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం వెనక ధీమా ఏంటో అనేది ఎవరికీ అంతుపట్టని విధంగా ఉంది.

No comments:

Post a Comment