Breaking News

18/11/2019

ధాన్యం ఎండ బెట్టె రోడ్లా.... వాహనాలు నడిపే దారులా...

వనపర్తి నవంబర్ 18  (way2newstv.in)
ఆర్ అండ్ బి ప్రధాన రోడ్లపై వరి ధాన్యాన్ని ఎండ బెట్టుతుండడంపై ఇవి ధాన్యం ఎండ బెట్టేరోడ్ల లేక వాహనాలు నడిపే దారులాని వాహనాల వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్ అండ్ బి రోడ్లపై అధికారుల పర్యవేక్షణ ఏమాత్రం లేకపోవడం వల్ల రోడ్లపై ఒకపక్క వివిధ రకాల పంటలను నూర్పిళ్ళు మరోపక్క వివిధ రకాల ధాన్యాన్ని ఎండబెట్టడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా రోడ్లపై వరి ధాన్యాన్ని ఎండబెట్టుడం, దాన్ని చుట్టుముట్టు రోడ్డు మధ్యలో రాళ్లు పెట్టడం వంటి సంఘటన చోటు చేసుకుంటుండగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాహనాల వారు విమర్శిస్తున్నారు. 
ధాన్యం ఎండ బెట్టె రోడ్లా.... వాహనాలు నడిపే దారులా...

ఇలా రోడ్లపై ఇవి జరుగుతుండటం వల్ల ప్రమాదాలు అధికంగా జరగవచ్చని పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అసలే గుంతలు పడిన రోడ్లు, ఆపై ధాన్యం ఎండబెట్టడం వంటివి  జరుగుతుండం ,ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండగా ప్రవేట్ డ్రైవర్లు ఆర్టీసీ బస్సులు నడుపుతున్న వల్ల ఏ సమయంలో ఏం జరుగుతుందోని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ధాన్యం ఎండబెట్టడం పై రైతులకు ఎస్సై అవగాహన....ఆర్ అండ్ బి ప్రధాన రోడ్లపై నూర్పిళ్ళు, ధాన్యం ఎండబెట్టడం సరైన పద్ధతి కాదని గోపాల్పేట ఎస్ ఐ రామన్ గౌడ్ రైతులకు అవగాహన కల్పించారు. రోడ్లపై ధాన్యాన్ని ఎండబెట్టడం వంటి సంఘటనల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని అందుకోసం రైతులు అందరు కూడా రోడ్లపై ధాన్యాన్ని ఎండపెట్టకూడదని ఆయన రైతులకు సూచించారు.

No comments:

Post a Comment