విజయవాడ, నవంబర్ 9 (way2newstv.in)
జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కోక్కటిగా నెరవేరుస్తున్నారు. అయితే మరో ముఖ్యమైన హామీ మాత్రం మిగిలిఉంది. దాని గురించి రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవు, డిమాండ్ కూడా చేయవు. ఎందుకంటే అది రాజకీయంగా కొంత ఇబ్బంది అవుతుందేమోనని ఆందోళన వారిలో ఉంది కాబట్టి. అయితే ముఖ్యమంత్రిగా జగన్ దాన్ని కూడా అమలు చేసేందుకు తొందర పడుతున్నారు. ఆ కీలకమైన హామీ ఏంటంటే కొత్త జిల్లాలు ఏర్పాటు. ఏపీలో ఇపుడు పదమూడు జిల్లాలు ఉన్నాయి. వాటిని పాతిక జిల్లాలు చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. దాని వల్ల పాలనాపరమైన సౌలభ్యం ఉంటుందన్నది జగన్ అభిప్రాయం. అదే సమయంలో పార్టీపరంగా, రాజకీయంగా కూడా వెసులుబాటు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.ఇక ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల తతంగం పొంచి ఉంది. నిజానికి ఈ ఎన్నికలను చంద్రబాబు టైంలోనే జరపాలి.
జిల్లాలకు ఇంకా టైముంది
అప్పటికి సార్వత్రిక ఎన్నికలకు ఏడాది టైం ఉండడంతో రిస్క్ చేయలేక బాబు వాయిదా వేశారు. ఇపుడు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అపుడే పాలన ఆరోనెలలోకి ప్రవేశించింది. దాంతో లోకల్ బాడీ ఎన్నికలు ఓ విధంగా తోసుకొస్తున్నాయనే చెప్పాలి. డిసెంబర్లో పెడతామని ఈ మధ్యనే మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. మొదట మునిసిపాలిటీలు అంటున్నారు. తరువాత పంచాయతీలు, మండలాలు ఉండొచ్చు, ఈ మొత్తం ఎన్నికల తతంగం వచ్చే ఏడాది మార్చిలోగా పోర్తి చేయాలన్నది స్థూలంగా ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది.ఈ విభజన ఇపుడు లోకల్ బాడీ ఎన్నికలను ముందుకు తెస్తుందా, వెనకకు తోస్తుందా అన్న చర్చ ఇన్నాళ్ళూ ఉండేది, అయితే స్థానిక ఎన్నికల తరువాతే జిల్లాల విభజన అని రెవిన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టంగా చెప్పేశారు. ఆయన చెప్పడం వరకూ బాగానే ఉన్నా జిల్లా పరిషత్తులకు ఎన్నికలు పెట్టిన తరువాత ఒక జిల్లాను రెండు ముక్కలుగా విడగొడితే అపుడు పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఉదాహరణకు విశాఖపట్నంలో జిల్లా పరిషత్ ఉంది.అరకు, అనకాపల్లి నుంచి జెడ్పీటీసీలు ఇక్కడికే వస్తారు. రేపు ఆ రెండు ప్రాంతాలను జిల్లాలుగా విడగొడితే మూడు జిల్లా పరిషత్తులు రావాలి. ఆ విభజన ఎలా ఉంటుందో. దీని మీద ప్రభుత్వానికి కూడా ఇప్పటివరకూ అవగాహన లేనట్లుగా ఉంది. మరో వైపు ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులో ఉంది. కొత్త జిల్లాలు అంటే మౌలిక సదుపాయలు ఇతరత్రా సమస్యలు, ఖర్ఛులూ చాలానే ఉంటాయి. దాంతో ఇప్పటికిపుడు కొత్త జిల్లాలు అన్నవి కుదిరే పని కాదనే చెబుతున్నారు. అలా ప్రస్తుతానికి జగన్ వాయిదా వేశారట అంటే అది ఎప్పటికి తెములుతుందో, లేక ఆ ప్రతిపాదన అలాగే మూలన పడి ఉంటుందో చూడాలి.
No comments:
Post a Comment