Breaking News

30/11/2019

స్టార్ హీరోస్ మధ్య సోషల్ వార్

చెన్నై, నవంబర్ 30 (way2newstv.in)
టాలీవడ్ లో డాన్స్ ల పరంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ముగ్గురికి ముగ్గురే డాన్స్ ల విషయంలో దుమ్మురేపగల సత్తా ఉన్న స్టార్ హీరోస్. ఇక తమిళనాట మాత్రం డాన్స్ వేసే హీరోలు చాలా అరుదు. అసలు అరుదు ఏమిటి తెలుగు హీరోలను తలదన్నేలా ఒక్క హీరో కూడా డాన్స్ చెయ్యడు. కొద్దో గొప్పో విజయ్ మాత్రం కాస్త డాన్స్ చేస్తాడు కానీ… అది ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ అంత కాదు. కోలీవుడ్ లో విజయ్ అలాంటి సో సో డాన్స్ టాప్. 
స్టార్ హీరోస్ మధ్య  సోషల్ వార్

అయితే ఇప్పుడు తమిళ తంబీలు విజయ్ ఫ్యాన్స్ మా హీరో విజయ్ కన్నా ఎన్టీఆర్ డాన్స్ గొప్పదా అంటూ సోషల్ మీడియాలో ఓవరేక్షన్ చేయడం, ఎన్టీఆర్ డాన్స్, విజయ్ ఇరగదీసిన కొన్ని స్టెప్స్ ఉన్న వీడియోస్ జతచేసి సోషల్ మీడియాలో రచ్చ చెయ్యడం మొదలెట్టారు.మరి డాన్స్ లో దుమ్మురేపే ఎన్టీఆర్ ని అంటే ఎన్టీఆర్ ఫాన్స్ ఊరుకుంటారా… ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. డాన్స్ లవర్స్ ఎవరూ ఊరుకోవడం లేదు. ఎన్టీఆర్ ముందు మీ హీరో విజయ్ బచ్చా అంటూ సోషల్ మీడియా వేదికగా తమిళ ఫ్యాన్స్ ని ఆడేసుకుంటున్నారు. మా విజయ్ డాన్స్ గ్రేట్ అంటూ తమిళ ఫ్యాన్స్ రెచ్చిపోతుంటే.. ఆగండాగండి.. మా ఎన్టీఆర్ బెస్ట్ మాస్ స్టెప్స్ ముందు మీ విజయ్ ని డాన్స్ చేసి చూపించమనండి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయ్ ఫ్యాన్స్ కి సవాల్ విసిరారు. ఇందులో స్టార్ హీరోస్ పోటీ లేకపోయినా ఫ్యాన్స్ మధ్య మాత్రం మాటల యుద్ధం ఓ రేంజ్ లో నడుస్తుంది.

No comments:

Post a Comment