Breaking News

18/11/2019

సీసీ కెమెరాలు ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్,నవంబర్,18 (way2newstv.in)
ఎల్లరెడ్డి పేట్ గ్రామంలో నేను సైతం కార్యక్రమం లో సీసీ కెమెరాలు మరియు ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరం భీం విగ్రహం ను రాష్ట్ర దేవాదాయ, గృహ, అటవీశాఖ, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు మరియు జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు శనివారం  ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ సీసీ కెమెరా వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నారు. నేరాల నియంత్రణకు పోలీసు-ప్రజల బాగస్వామ్యం చాల ముఖ్యం, ఒక్కో సీ.సీ కెమెరా 100 మంది సిబ్బంది నేత్రాలతో సమానం, సీసీ కెమెరాలు నిరంతరం నిఘాలో ఉండి 100 మంది సిబ్బంది చేసే పని ఒక్క సీసీ కెమెరా చేయగలుగుతుందని అన్నారు.
సీసీ కెమెరాలు ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

కొమరం భీం చరిత్ర గురించి వివరింస్తు కొమురం భీము గిరిజన కొమరం చిన్నూ-సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలోని సంకేపల్లి గ్రామంలో కొమరం భీమ్ 1901 సంవత్సరంలో జన్మించాడు. భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించినారు.జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ సీసీ కెమెరా 24 గంటలు నిరంతరం పనిచేస్తునే ఉంటుంది. సీసీ కెమెరా వల్ల నేరస్తుడిని సులువుగా పట్టుకోవచ్చు. ఏదైనా సంఘటన జరిగితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్లయితే సంఘటనకు సంబంధించి సాక్ష్యాలను సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సేకరించవచ్చు. ఈ సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా సంఘటనకు సంబందించి నిందితులను, నేరస్తులను సులభంగా గుర్తించవచ్చు. నేరస్తులకు శిక్షలు పడడములో సీసీ కెమెరా ఆధారాలు చాలా ఉపయోగపడుతున్నాయి. వ్యాపార సముదాయాలలో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేసిన్నట్లయితే  అక్కడికి వచ్చి పోయే వారి కదలికలను తెలుసుకోవచ్చునని అన్నారు.కొమురం భీము ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయుంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు.ఈ కార్యక్రమంలో జడ్పీ చెర్మన్ విజయలక్ష్మి రంకిషన్ రెడ్డి, డిఎస్పీ ఉపేందర్ రెడీ, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఐ కృష్ణ కుమార్, ఎల్ల రెడ్డి పేట్ గ్రామ సర్పంచ్ సునంద రాములు మరియు నాయకులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment