Breaking News

21/11/2019

ఇంకా కొలిక్కి రాని మహారాష్ట్ర

ముంబై, నవంబర్ 21 (way2newstv.in)
శివసేనను మహారాష్ట్రలో అధికారంలోకి రానివ్వకుండా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. బీజేపీ, శివసేనలు ఎన్నికలకు ముందు కూటమిగా ఉన్నా ఫలితాల అనంతరం విడిపోయాయి. ఇప్పుడు అదే తరహాలో ఎన్నికలకు ముందు ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీల కూటమిని విడదీసి లబ్దిపొందాలన్న ప్రయత్నంలో బీజేపీ ఉందన్న ప్రచారం మహారాష్ట్రలో జోరుగా సాగుతోంది. మహారాష్ట్ర రాజకీయాలకు తెరపడకపోవడానికి వెనక నుంచి బీజేపీ చేస్తున్న ప్రయత్నమే కారణమంటున్నారు విశ్లేషకులు.మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. రాష్ట్రపతి పాలన కూడా విధించినా ప్రభుత్వ ఏర్పాటు పై స్పష్టత రాలేదు. నిజానికి శివసేన తమ నుంచి వెళ్లిపోయే ధైర్యం చేయదనుకున్నారు కమలనాధులు. 
ఇంకా కొలిక్కి రాని మహారాష్ట్ర

కానీ శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం తలాక్ చెప్పేసి వెళ్లిపోవడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు గౌరవపూర్వకంగానే శివసేనను మాట్లాడుతున్నా లోలోపల శివసేనను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు.మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మద్దతు ఖచ్చితంగా అవసరం. శరద్ పవార్ ను చూసుకునే తొలి నుంచి శివసేన చిందులేస్తుందన్న విషయాన్ని గుర్తించిన బీజేపీ శరద్ పవార్ ను ముగ్గులోకి లాగడానికి ప్రయత్నిస్తుందన్న అనుమానం కలుగుతోంది. శరద్ పవార్ ఇప్పటి వరకూ ప్రభుత్వ ఏర్పాటు పై స్పష్టత ఇవ్వకపోవడం, గంటకో ప్రకటన చేస్తుడంటం ఈ అనుమానాలకు తావిస్తోంది.అందుకే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు దేశంలో అత్యున్నత పదవి ఇవ్వాలన్న ఆఫర్ ను బీజేపీ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రతిగా ఎన్సీపీ బీజేపీకి మద్దతిచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయంటున్నారు. అందుకే సోనియా గాంధీతో జరిగిన సమావేశం తర్వాత జరగాల్సిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సమావేశం వాయిదా పడుతూ వస్తుండటం ఈ అనుమానాలను మరింత బలపరుస్తుందంటున్నారు. అయితే ఇది సాధ్యం కాదన్నది అన్ని పార్టీల నేతల అభిప్రాయం. శరద్ పవార్ బీజేపీతో జట్టుకట్టరనే విశ్వాసం కాంగ్రెస్, శివసేనల్లో వ్యక్తమవుతోంది. అయితే శరద్ పవార్ విధించే షరతులేంటి? శివసేన అందుకు అంగీకరిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ బీజేపీ, శివసేనల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తుండటం విశేషం.

No comments:

Post a Comment