Breaking News

30/11/2019

పల్లెలకు నిధుల సీజన్

మెదక్, నవంబర్ 30, (way2newstv.in)
పల్లెలకు... జోరుగా నిధులు
పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. గ్రామ పంచాయతీలకు ప్రతినెలా నిధులు విడుదల చేస్తుండటంతో గ్రామాలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో కలువగా మరికొన్ని గ్రామ పంచాయతీలుగా విడిపోయి నూతన గ్రామ పంచాయతీలుగా ఆవిర్భవించాయి. వాటికి సైతం జనాభా ఆధారంగా నిధులు వెచ్చించనున్నారు. ఇప్పటికే జిల్లా పంచాయతీరాజ్ సిబ్బంది జనాభా లెక్కల ప్రకారం నిధుల కేటాయింపును ప్రారంభించారు. ఈ నెల చివరి వరకు ఆ నిధులను ట్రెజరీలకు పంపించి నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయనున్నారు. వీటిని కూడా ఉపయోగించుకుని గ్రామాలు మరింత అభివృద్ధి సాధించేలా ఆయా గ్రామ పంచాయతీల సభ్యులు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తుంది. 
పల్లెలకు నిధుల సీజన్

ఈ విధంగా 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు వినియోగించుకుని దేశంలోనే తెలంగాణ గ్రామ పంచాయతీలు మొదటి వరుసలో నిలువాలని ప్రభుత్వ ఆకాంక్ష.జిల్లాలో మొన్నటి వరకు జరిగిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంతో పల్లె సమస్యలను పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అభివృద్ధి బాట పట్టించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. పల్లె ప్రగతి ప్రత్యేక ప్రణాళికలో భాగంగా రూపొందించిన వార్షిక ప్రణాళిక పనులు చేపట్టేందుకు, ఏడాది పొడవునా గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండేందుకు అవసరమైన నిధులను సమకూర్చనున్నది. ప్రతి పల్లె అభివృద్ధి చెందాలన్న ధ్యేయంతో తెలంగాణ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రెండు సంస్థల ద్వారా జిల్లాకు రూ.10 కోట్ల 44 లక్షలు వచ్చాయి.తెలంగాణ గ్రామ పంచాయతీలను దేశంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. దీంతో గ్రామ పంచాయతీలకు నిధులు వెల్లు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళిక కార్యాచరణ కార్యక్షికమం తర్వాత ఆయా గ్రామాలకు జనాభా ప్రాతిపదికన నిధులను వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు విడుదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులుతో పాటు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రెండు సంస్థల ద్వారా జిల్లాకు రూ.10 కోట్ల 44లక్షలు వచ్చాయి. ఇందులో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.6 కోట్ల 55లక్షల వేలు రాగా, ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ.4 కోట్ల 3 లక్షల 7వేలు మంజూరయ్యాయి. అలాగే పెర్ఫ్మాన్స్ గ్రాంటు కింద మరో రూ.5 కోట్ల 55 లక్షల 13వేలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి అన్ని ఎస్టీవో కార్యాలయాలకు గ్రామ పంచాయతీల వారీగా నిధులను నమోదు చేయగా వాటిని గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేశారు. వాటిని గ్రామ పంచాయతీల్లో పలు అభివృద్ధి కార్యక్షికమాలకు ఖర్చు చేయనున్నారు.గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఆయా గ్రామాల జనాభాను బట్టి అభివృద్ధి నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో ఒక్కొక్కరికీ రూ.165.70 చొప్పున కేటాయించింది. గ్రామ పంచాయతీలకు మంజూరైన నిధుల్లో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల పై చిలుకు జనాభాకు రూ.165.70చొప్పున మంజూరు చేశారు. ఈ నిధులతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. అలాగే సమగ్ర అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది.ఈ సారి గ్రామ పంచాయతీలకు విడుదలైన 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పెర్ఫ్మాన్స్ గ్రాంటు కింద రూ.5 కోట్ల 55 లక్షల 13వేలు మంజూరయ్యాయి. 2017-1 సంవత్సరానికి గాను జిల్లాలోని ఎంపిక చేయబడ్డ గ్రామ పంచాయతీలకు పెర్ఫ్మాన్స్ గ్రాంటు కింద నిధులను మంజూరు చేశారు. పన్నులు ఇతర వాటికి సంబంధించి గ్రామ పంచాయతీల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించిన గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి వాటికి బెస్ట్ పెర్ఫ్మాన్స్ గ్రాంటును ఇచ్చారు. ఈ నిధులను సైతం గ్రామ పంచాయతీల వారీగా కేటాయించనున్నారు.

No comments:

Post a Comment