Breaking News

12/11/2019

ఏపీలో బడ్జెట్ లోటు 60 వేల కోట్లపైనా

విజయవాడ, నవంబర్ 12 (way2newstv.in)
ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని ప్రమాణం వేళ జగన్ స్వయంగా చెప్పారు. ఇప్పటికి అయిదు నెలలు పూర్తి అయి అరో నెల ప్రవేశించింది. కేంద్రం నుంచి నిధులు లేకపోతే జగన్ సర్కార్ పధకాలు, ఆలోచనలు మొత్తం ఉల్టా సీదా అవుతాయి. ఏడు నెలలకు 22 వేల కోట్లు వస్తే మిగిలిన అయిదు నెలలకు మరో ఇరవై వేల కోట్లు వస్తే గొప్పే. అంటే ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి కేంద్ర సాయం 40 వేల కోట్లకు పరిమితం అయితే జగన్ బడ్జెట్లో 60 వేల కోట్లు లోటు కనిపిస్తుంది. ఇక ఏపీలో ఉన్న ఆర్ధిక పరిస్థితులు చూసుకుంటే మిగిలిన లక్షా 27 వేల కోట్ల బడ్జెట్ కి తగిన ఆదాయం వస్తుందా అన్నది డౌటేనని అంటున్నారు. ఇదివరకూ సింహ భాగం వాటా వచ్చే మధ్యం అమ్మకాలు నిషేధం విధానం, కొత్త పాలసీ పుణ్యమాని బాగా తగ్గిపోయాయి. ఆర్ధిక మాంధ్యం వల్ల వ్యాపారాలు సాగడంలేదు. 
ఏపీలో బడ్జెట్ లోటు 60 వేల కోట్లపైనా

ఎక్కడా లావాదేవీలు లేవు. ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలు అయింది. దాంతో రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గింది. రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా పడిపోయింది. రివర్స్ టెండరింగ్ విధానాల వల్ల అభివ్రుధ్ధి లేదు, కొత్త ప్రాజెక్టులూ లేకుండా పోయాయి. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో వివిధ శాఖలు, పద్దుల ద్వారా రావాల్సిన ఆదాయం కూడా గణనీయంగా తగ్గుతుంది అంటున్నారు. అదే జరిగితే ఒక్క ఏడాదిలోనే జగన్ ఆశలు కుప్పకూలుతాయని అంటున్నారు. ఆ అవకాశం కోసమే విపక్షాలు కూడా కాచుకుని కూర్చున్నాయి.జగన్ సర్కార్ మీద అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు. జగన్ ని ఎన్నో మాటలు అన్న జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఏ పనులూ చేయనపుడు ఆరోపణలు ఎందుకుంటాయి అని ఎకసెక్కం ఆడారు. ఆ విధంగా అవినీతిలేని పాలన అని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నట్లైంది. ఇక చంద్రబాబు అయితే రొటీన్ విమర్శలు చేస్తారు. అవినీతి సర్కార్ అనేస్తూ ఉంటారు కానీ దాన్ని జనం కేవలం విమర్శగానే చూస్తున్నారు. ఇక జగన్ పెట్టుకున్న ఆరు నెలల గడువులో మంచి ముఖ్యమంత్రి అని అందరూ అనకపోయినా బాగానే పాలన ఉంది అనే వారు ఎక్కువగానే ఉన్నారు. సరే ఇక మరో ఆరు నెలలు పోతే జగన్ ఏడాది ముఖ్యమంత్రి అవుతారు. ఈ ఆరు నెలలూ జగన్ ఎలా రాజ్యం చేయాలనుకుంటున్నారో ఆయన యాక్షన్ ప్లాన్ రెడీగానే ఉంది. అయితే విపక్షాలు కూడా ఆ ఆరు నెలల కోసమే ఎదురు చూస్తున్నాయి. గట్టిగా ఏడాది పూర్తి అయితే జగన్ సర్కార్ రంగు రుచి వాసన మొత్తం తెలుస్తాయని కాచుకుని కూర్చున్నాయి.జగన్ అధికారంలోకి అయితే వచ్చారు కానీ ఆర్ధిక పరిస్థితి మాత్రం ఆయన కంట్రోల్ లో లేదు. కేంద్రం సాయం కోసమే ఆయన ఎదురుచూస్తున్నారు. 2 లక్షల 27 వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో లక్ష కోట్లు పూర్తిగా కేంద్ర సాయం మీదనే జగన్ భారం వేశారు. అంటే కేంద్ర పన్నుల్లో వాటాగా 35 వేల కోట్లు, కేంద్రం గ్రాంట్లుగా 62 వేల కోట్లు వస్తాయని జగన్ లెక్కలు వేసుకున్నారు. ఇప్పటివకూ చూసుకుంటే కేంద్రం నుంచి గడచిన ఏడు నెలల కాలంలో 22 వేల కోట్లు మాత్రమే వచ్చాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పన్నుల రూపంలో 13 వేల కోట్లు, గ్రాంట్ రూపంలో తొమ్మిది వేల కోట్లు వచ్చాయన్నమట. జగన్ జూన్ నుంచి పాలన మొదలు పెడితే అంతకు రెండు నెలలతో కలుకుని వచ్చిన నిధులు ఇవి. గ్రాంట్ అంటే కేంద్రం ఉదారంగా ఇవ్వాల్సిందనే. చంద్రబాబు అంత జిగినీ దోస్తుగా కేంద్రంతో ఉన్నపుడే ఆయన 60 వేల కోట్ల గ్రాంట్లు కోరితే ఏపీకి వచ్చినవి 18 వేల కోట్లు, ఇపుడు జగన్ దోస్తూ కాదు, ఏపీలో బీజేపీ రాజకీయ ఆస్తులు కూడా లేవు. మరి జగన్ కి ఎలా కేంద్రం సాయం చేస్తుందన్నది పెద్ద ప్రశ్న.

No comments:

Post a Comment