హైదరాబాద్ నవంబర్ 1 (way2newstv.in):
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 4న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి.
4న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్?
మొదట కోర్టు సమస్యలు లేని మున్సిపాలిటీలకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనుండగా, తర్వాతి దశలో మిగతావాటికి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ చైర్మన్, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల కసరత్తు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మున్సిపల్ శాఖ వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన డ్రాను తీయనుంది.
No comments:
Post a Comment