పోలీసుల అదుపులోకి నిందితులు
హైదరాబాద్ అక్టోబర్ 31(way2newstv.in):
నగరంలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బతికి ఉన్న శిశువును పూడ్చిపెట్టేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన ఓ ఆటోడ్రైవర్ అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వారిని విచారించగా..
బతికి ఉన్న శిశువును పూడ్చిపెట్టేందుకు యత్నం
తమ మనుమరాలు చనిపోవడంతో వాహనాల్లో ఎవ్వరు కూడా ఎక్కించుకోవడం లేదనీ, దీంతో ఇక్కడే శిశువును పూడ్చి పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. కాగా, శిశువు మాత్రం బతికే ఉంది. శ్వాస, కదలికలు స్పష్టంగా కన్పిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఆడబిడ్డ అయినందునే వారు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు తెలిపారు. శిశువును చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన అఫ్జల్‌గంజ్ పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.
No comments:
Post a Comment