Breaking News

12/10/2019

మున్సిపాలిటీ పరిధిలోని వీధులలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్
జగిత్యాల, అక్టోబర్, 12 (way2newstv.in)
జగిత్యాల మున్సిపాలిటీ పనులపై శనివారం నాడు జిల్లా కలెక్టరేట్లో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్. సంజయ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ తన చాంబర్లో సమీక్షించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని కొత్తగా విలీనమైనా గ్రామ పంచాయతీల సిబ్బంది నీ మున్సిపాలిటీలో తీసుకొని ఆయా గ్రామాలలో మరియు మున్సిపాలిటీ పరిధిలోని వీధులలో పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రపరచుట, మురికి కాలువలు శుభ్రపరచుట, నీరు నిలువకుండా యుండుట కు చర్యలు తీసుకొని దోమల నివారణ కు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. 
మున్సిపాలిటీ పరిధిలోని వీధులలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలి

హరితహారం లో భాగంగా వానలు పడుతున్నందున మున్సిపాల్టీ పరిధిలో మొక్కలు నాటాలని అన్నారు. మున్సిపాలిటీలో ఎక్కువ నిధులులైటింగ్, డ్రైనేజీ కి కావలసిన ఎస్టిమేషన్ ను తయారుచేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో గల చెరువుల కట్టల వెంట ఈత వనాలను పెంచాలని తెలిపారు. రైతు బజారు ఏర్పాటు రోడ్డు వైండింగ్ పై కూడా చర్చించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment