కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి అక్టోబర్ 11 :(way2newstv.in):
వనపర్తి జిల్లా ను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లడం లో రెవెన్యూ ఉద్యోగులు ముందుండాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. వనపర్తి జిల్లాగా ఏర్పాటై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగవ సంవత్సరం లో అడుగిడుతున్న సందర్భంలో శుక్రవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును కట్ చేశారు.
జిల్లా అభివృద్ధిలో రెవెన్యూ సిబ్బంది ముందుండాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగం ద్వారా పేద ప్రజలకు సేవలందించడం వరమని, అందువల్ల ఉద్యోగులు ప్రత్యేకించి రెవిన్యూ ఉద్యోగులు పెదప్రజల కు సాధ్యమైనంత త్వరగా లబ్ది చేకూర్చేలా పని చేయాలని చెప్పారు.జాయింట్ కలెక్టర్డి.వేణుగోపాల్,ఇంచార్జి డిఆర్వో వెంకటయ్య,ఏవో శ్రీనివాసరావు ,కలెక్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment