పాలమూరు, అక్టోబరు 28,(way2newstv.in)
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులతో పాటు వార్డెన్లు, సిబ్బంది పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భా గంగానే జిల్లాలోని 18 ఎస్సీ హాస్టళ్ల పాటు నా లుగు కళాశాల విద్యార్థుల హాస్టళ్లలో సైతం సీసీ కె మెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 18 సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో 2,100 మంది విద్యార్థులు సాగిస్తున్నారు. కళా శాల విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన నాలుగు హాస్టళ్లలో 500మంది విద్యార్థులు చదువుతున్నా రు. రోజువారీగా విద్యార్థుల హాజరుతో పాటు అ ల్పాహారం, రాత్రి భోజనం, ట్యూషన్ల పనితీరును తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించారు.
సంక్షేమ గృహాల్లో నిఘా
అంతేకాకుండా నిత్యకృత్యాలు, ఆటాపాటలతో పాటు విద్యార్థు లు గొడవపడుతున్న తీరును నేరుగా తెలుసుకుని మానిటరింగ్ చేసేందుకు వార్డెన్లకు అవకాశం ఉంటుంది.దీంతో రోజువారి విద్యార్థుల దైనందిన పరిస్థితులను తె లుసుకోవడమే కాకుండా వారు అనుసరిస్తున్న ప ద్ధతులను మానిటరింగ్ చేసే అవకాశం ఉండటంతో హాస్టల్ వార్డెన్లకు మరింత బాధ్యత పెరిగినట్లయింది. హాస్టళ్లలో రోజువారీగా విద్యార్థులు హాజరయ్యే సంఖ్యను బట్టి వారికి వండిపెట్టేందుకు బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె తదితర వాటిని సరఫరా చేస్తారు. అయితే గతంలో ఈ సరుకులు సగం పక్కదారిపట్టేవి. విద్యార్థుల సంఖ్యను త ప్పుగా చూపుతూ అక్రమాలకు పాల్పడేవారు. ప్ర భుత్వం సరఫరా చేసిన ఆహారధాన్యాలు వసతి గృహాల నుంచి బయటికి వెళ్లకుండా వ్యవస్థ ద్వా రా కట్టుదిట్టమైంది. గతంలో విద్యార్థుల సంఖ్యను బేరీజు వేసుకుని తూతూమంత్రంగా హాస్టళ్ల నిర్వహణను కొనసాగించిన పలువురు వార్డెన్లకు సీసీ కెమెరాల ఏర్పాటు, బయోమెట్రిక్ విధానం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయింది
No comments:
Post a Comment