Breaking News

25/10/2019

బ్రెజిల్ లో భారతీయులకు నో విసా

న్యూఢిల్లీ, అక్టోబరు 25 (way2newstv.in)
భారతీయులకు వీసా విషయంలో బ్రెజిల్ అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ పౌరులకు ఇకపై వీసాలు అవసరం లేదని గురువారం ప్రకటించారు. తమ దేశంలో పర్యటించే చైనా, భారతీయ పర్యాటకులు, వ్యాపారవేత్తలు వీసాలు పొందాలనే నిబంధనను తాము పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో గురువారం స్పష్టం చేశారు. మితవాద రాజకీయ నేతగా గుర్తింపు పొందిన బోల్సోనారో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన బ్రెజిల్ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారం చేపట్టారు.అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వీసా నిబంధనలు సడలిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 
బ్రెజిల్ లో భారతీయులకు నో విసా

కానీ, చైనా అధికార పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల పౌరుల వీసాకు సంబంధించిన విధానం గురించి తొలిసారి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా నుంచి వచ్చే పర్యాటకులు, వ్యాపారవేత్తలకు వీసాతో పనిలేదని లేదని బ్రెజిల్ ఈ ఏడాది ఆరంభంలో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, దీనికి ప్రతిఫలంగా ఆ దేశాలు బ్రెజిల్ పౌరులకు వీసా నిబంధనల్లో ఎలాంటి సడలింపులు చేయకపోవడం విశేషం.అగ్రరాజ్యం అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండగా, దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్ మాత్రం ఏకంగా వీసా అవసరం లేదని ప్రకటించింది. వ్యక్తిగత వివరాలతో పాటు తాము వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల ఖాతా వివరాలనూ కూడా అందజేయాలని అమెరికా ఈ జూన్‌లోనే కొత్త నిబంధన తీసుకొచ్చింది. తాత్కాలిక పర్యాటకులతో పాటు దాదాపు అన్ని వీసా దరఖాస్తులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇందుకోసం డ్రాప్ డౌన్ మెనూను అందుబాటులోకి తెచ్చింది.

No comments:

Post a Comment