Breaking News

31/10/2019

మహిళలకు ప్రోత్సహాం

విశాఖపట్నం అక్టోబర్ 30  (way2newstv.in)
ముఖ్యమంత్రి జగన్ పరిపాలన పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ కైలాసపురం వద్ద ఉన్న మైదానంలో మహిళా సంఘాలకు రుణ పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి శ్రీనివాస్‌ జిల్లా అధికారులు పాల్గోన్నారు. టీడీపీని చంద్రబాబు గొంతు నులిమి చంపుతున్నారని, టీడీపీని బీజేపీకి ధారాదత్తం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకి సొంతపుత్రుడు లోకేష్‌ అయితే, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్ అని అన్నారు. 
మహిళలకు ప్రోత్సహాం

రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుంటే ముసలి నక్క, యువ నక్క ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. విశాఖలో భూకుంభకోణాలపై సిట్‌ వేశామని, బాబు, పవన్ పన్నాగాలకు ఎవరూ లోనుకావొద్దని విజయసాయిరెడ్డి సూచించారు. వైఎస్సార్ సిపి ప్రభుత్వం రావడానికి మహిళలే ప్రధాన పాత్ర పోషించారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖను అన్ని విధాల అభివృద్ది చేస్తామని చెప్పారు.ఇపుడు టిడిపి నేతలు ఇసుకపై మాడ్లాడుతున్నారని,గత అయిదేళ్లలో టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా ఇసుక దోచుకున్నారో తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.గత అయిదేళ్ల టిడిపి నేతల అవినీతిపై ఎందుకు స్పందించలెదని పవన్ కళ్యాణ్ ను మంత్రి శ్రీనివాస్ నిలదీశారు.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 80 శాతం నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.

No comments:

Post a Comment