నెల్లూరు, అక్టోబరు 16 (way2newstv.in)
యుధ్ధంలో మన బలం ఏంటో ఎదుటి వారికి తెలియకూడదు. బలం ఎంత తక్కువగా ఉన్నా మ్యానేజ్ చేయగలగాలి. వ్యూహాలు అంత పదుగుగా ఉండాలి. మరి వాటిని వదిలేసి అసలు గుట్టు చెప్పేస్తే ముందే ఓడిపోయినట్లుకాదా. నాలుగు దశాబ్దాల రాజకీయ దురంధరుడు చంద్రబాబుకు ఈ విషయాలు తెలియవు అనుకోగలమా. కానీ ఘోరమైన ఓటమి ఎదురుకావడంతో పాటు పార్టీ పరిస్థితి నానాటి దిగజారిపోవడంతో బాబు తనను తాను అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. ఫలితంగా బాబు చెప్పకుండానే నిజాలు దొర్లుకువచ్చేస్తున్నాయి. అదే ప్రత్యర్ధి వైసీపీకి అస్త్రాలుగా మారుతున్నాయి.ఏపీలో బీజేపీ ఓ పార్టీయేనా అన్నది ఇదే చంద్రబాబు. ఆ పార్టీ అసలు ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది. డిపాజిట్లు అయినా వస్తాయా అని ఎద్దేవా చేసింది కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబే.
బాబు మాటలే వైసీపీ అస్త్రాలు
మాకు ప్రతీ బూతు లెవెల్లో బలం ఉంది. దేశంలో అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అంటూ గొప్పలు పోయారు. మేము ఒంటరిగానైనా గెలవగలం అని నిబ్బరంగా చెబుతూ జబ్బలు చరిచారు. మరిపుడు బేలతనం ఒక్కసారిగా ఆవహించిన చంద్రబాబు పొరపాటు జరిగిపోయింది. బీజేపీని దూరం చేసుకున్నాం, మోడీతో అనవసరంగా గొడవపడ్డామని వాపోతున్నారు. ఇలా చంద్రబాబు గారి విలాపాలు అన్నీ ఇన్నీ కావు. అంటే నిజాలు చెప్పకనే చెప్పేస్తున్నారు. తమకు ఒంటరిగా పోటీ చేసి గెలవగలిగే బలం లేదని. పొత్తులు లేకపోవడం వల్లనే ఓడిపోయామని కూడా ఒప్పేసుకుంటున్నారు. కరివేపాకుగా తీసేసిన బీజేపీ బలం ఏంటో కూడా తెలిసివచ్చిందా అని కమలనాధులు ఇపుడు అంటున్నారు.ఇపుడున్న పరిస్థితుల్లో జగన్ ని ఢీ కొట్టడం అసాధ్యం అన్న సందేశాన్ని చంచ్రబాబు ఇచ్చేశారు. తమ్ముళ్లకు భరోసా ఇవ్వాల్సిన పసుపు పార్టీ పెద్దాయన మనం గెలవాలంటే అటు బీజేపీ, ఇటు పవన్ కళ్యాణ్ ఉండి తీరాల్సిందేనని ఉన నిజాలు చెప్పేశారు. అంటే చంద్రబాబు గారిని చూసి ధైర్యం తెచ్చుకుని గెలుపు కోసం పోరాడుతున్న తమ్ముళ్లకు చంద్రబాబు గారే దగ్గరుండి మరీ పిరికిమందు నూరిపోసేశారు. జగన్ని గెలవడం కష్టమని కూడా చెప్పేశారు. అంటే చంద్రబాబు గారిని కమలం, పవన్ కల్యాణ్ మోయాలన్నమాట. ఆయన గారిని ముఖ్యమంత్రిగా చేయాలన్నమాట.అపుడు చంద్రబాబు పడేసే కొద్దో గొప్పో సీట్లు తీసుకుని జై టీడీపీ అనాలన్నమాట. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. అంటే గతం అపుడు టీడీపీ బలంగా ఉంది. అలా ఉందని కూడా నమ్మారు మిత్రులు. అందుకే చంద్రబాబు చెప్పినట్లుగా చేశారు. ఇపుడు మరీ బొత్తిగా 23 సీట్లకు పడిపోయి బేల మాటలు మాట్లాడుతున్న చంద్రబాబుతో పొత్తు ఎందుకు అనే అంటారు. అందుకే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ తూచ్ అనేశారు. ఏపీలో టీడీపీ బలం ఎంత అని ఆయన ఇపుడు గర్జిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు తన బలహీనతను తానే బయటపెట్టేసుకుని టీడీపీకి ఉన్న ఉసురు కూడా తీసేశారని తమ్ముళ్ళు లబోదిబోమంటున్నారంటే అర్ధముందిగా.
No comments:
Post a Comment