Breaking News

01/10/2019

రాజకీయాలు... ఫెయిల్యూర్స్

హైద్రాబాద్, అక్టోబరు 1 (way2newstv.in)
సినిమా ప్రపంచం వేరు. అది పూర్తిగా వూహాలోకం. కల్పితం. కలలు, భ్రమలు, బాజాలు, భజంత్రీలు ఇలా ఏ విధంగా చూసినా రంగు హంగుల లోకం. అక్కడ అంతా అందాలే, ఆనందాలే, పాజిటివ్ వైబ్రేషన్లే. ఎటు చూసినా శభాష్ అంటూ చప్పట్లే, చప్పుళ్లే. ఒక్క చెడ్డ మాట చెవికి వినపడదు. ఓ విధంగా డెమ్మీ గాడ్స్ సినిమా తారలు. అటువంటి వారికి రాజకీయం అంటే పూర్తి విరుధ్ధమైన ప్రపంచం. ఇక్కడ అంతా తిట్లూ, చీవాట్లు, శాపనార్ధాలు, ఒక్క మంచి మాట చెప్పని లోకం ఇది. ఎంత చేసినా చెడ్డను అంటకట్టే లోకం ఇది. ఓ విధంగా రాజకీయం అంటే రొచ్చు. ఒక భయంకరమైన ఉచ్చు. 
అయిజ మున్సిపాలిటీలో మెయిన్  డ్రైనేజి కాలువ పనులకు శంకుస్థాపన

కోరి అందులో చిక్కుకోవాలని ఎవరూ అనుకోరు. అందులో సినిమా వారు అసలు అనుకోరు.రాజకీయాల్లో హిట్లు అందుకున్న వారు ఉన్నారు. డిజాస్టర్లతో వెనుతిరిగిన వారు కూడా ఉన్నారు. రెండు సూపర్ హిట్లు అందుకుని వరసగా 1983, 1985 ఎన్నికల్లో గెలిచాక అన్న నందమూరికి భారీ డిజాస్టర్ 1989లో వచ్చింది. ఆయన తానే స్వయంగా దారుణంగా ఓడిపోయారు. దాంతో ఆయన మనసు వెంటనే లాగింది సినిమా వైపుగానే. ఇక 1994లో గెలిచినా 1995లో అల్లుడే దించేసిన పరాభవం ముందు ఏ ఘోరమైన డిజాస్టర్ కూడా సరిపోలదేమో. ఓ విధంగా రామారావు సైతం రాజకీయాల్లో కుదురుగా ఉండలేకపోయారనే చెప్పాలి. ఇక 1984 తరువాత వచ్చిన వారిలో నార్త్ నుంచి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఉంటారు. ఆయన అలహాబాద్ నుంచి ఎంపీగా గెలిచి వచ్చారు. కానీ ఆయన రాజకీయం అయిదేళ్లకే ముగిసిపోయింది. తన స్నేహితుడు రాజీవ్ గాంధి మాట మీద వచ్చి ఆ స్నేహితుడితోనే విభేదాలు వచ్చి వెనక్కు తప్పుకున్నారు. ఇక రాజకీయంగా ఫట్ అయిన అమితాబ్ మళ్లీ ఆ వైపునకు పోలేదు.ఇలా అమితాబ్ తన అనుభవ సారాన్ని ఎవరితో చెప్పాలి అంటే తోటి సినీ నటులతోనే కదా. అందుకే ఆయన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్తాను అంటే వద్దు నాయనా అని చెప్పారంట. ఇక చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం, వెనక్కి రావడం జరిగిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా చెప్పారట. ఆయన పొలిటికల్ కధా ఫెయిల్యూర్ స్టోరీనే. తాజాగా అమితాబ్ చిరంజీవితో కలసి మరీ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. ఇక చిరంజీవి సైతం రాజకీయాల జోలికి వెళ్ళవద్దు అంటూ తన మిత్రులు రజనీకాంత్, కమల్ హాసన్ లకు చెప్పుకొచ్చారు. అవి మన లాంటి సినిమా వాళ్లకు పడవు అంటూ తన స్వీయ రాజకీయ అనుభవం కధ వినిపించారు. మొత్తానికి చూసుకుంటే అమితాబ్, చిరంజీవి రాజకీయాలంటేనే వద్దు అంటున్నారు. పవన్ పార్టీ ఓడినా కొనసాగిస్తానని అంటున్నారు. కమల్ కూడా అంతే, రజనీ సైతం ఒకసారి ఆ రుచి చూడాలనుకుంటున్నారు. కానీ రాజకీయం అంటే అదొక బ్రహ్మ పదార్ధమన్న భ్రమ‌లు వీడి, తాము కూడా ప్రజల్లో ఒకరము అని అనుకుంటే మాత్రం అక్కడ కూడా హిట్లు కొట్టవచ్చేమో. చూడాలి మరి.

No comments:

Post a Comment