Breaking News

24/10/2019

సీపెట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం, కేంద్ర మంత్రి

విజయవాడ, అక్టోబరు 24 (way2newstv.in)
కృష్ణా జిల్లా సూరంపల్లిలో సీపెట్ ప్రారంభమైంది. సీపెట్ శాశ్వత భవనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడతో కలిసి ప్రారంభించారు. రూ.50 కోట్ల వ్యయంతో సీపెట్ను నిర్మించారు.  ముఖ్యమంత్రి జటన్ మాట్లాడుతూ సిపెట్ లో ట్రైనింగ్ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు 25 పార్లమెంట్ నియజకవర్గాల్లో ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇండస్ట్రీని కవర్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ లు ప్రారంభించబోతున్నామని అన్నారు. దేశంలోనే మొదటిసారి 75 శాతం లోకల్ వారికి ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేసాం.  చట్టం తో పాటు బాధ్యతగా పారిశ్రామిక వేత్తలకు స్కిల్ ఉన్న వారిని అందించాలి. 
సీపెట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం, కేంద్ర మంత్రి

పరిశ్రమలకు కావాల్సిన విధంగా మన యువత ను ట్రైన్ చేస్తాం. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే మా ప్రభుత్వ ద్యేయమని అన్నారు.కేంద్ర మంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో పాటు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ రి సైకిల్ చెయ్యడం తప్పనిసరి. ప్లాస్టిక్ రీసెర్చ్ పై కేంద్రం దృష్టి పెడుతుంది. వినూత్న ఆలోచనలతో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిరోదించేందుకు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. నూతన రాష్ట్రాల అభివృద్ధి పై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని అన్నారు. విశాలమైన కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని అన్నారు.. నెల్లూరు జిల్లా నాయుడు పేటలో మరో సిపెట్ సెంటర్ ని ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈ   సిపెట్ ఆధ్వర్యంలో  2015వ సంవత్సరం నుండి శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆర్ధిక సహాయంతో రూ . 50 కోట్లతో క్రొత్త భవనం ఏర్పాటు చేసారు. రూ . 20 కోట్లతో భవన నిర్మాణంతోపాటు మరో 30 కోట్లతో ఆధుకని సాంకేతికతో  కూడిన ధర్మల్ ల్యాబ్ , ఆప్టికల్ ల్యాబ్ , ఎలక్ట్రికల్ ల్యాబ్ , మెకానికల్ ల్యాబ్  ఏర్పాటు చేసారు. ఇక్కడ డిప్లమో ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ , డిప్లమో ఇప్లాస్టిక్ మోల్ టెక్నాలజీ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమోఇ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ వంటి దీర్ఘకాలిక కోర్సులలో నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.  ప్లాస్టిక్, దాని నుబంధ రంగాలు , ప్రాసెసింగ్ , టెస్టింగ్ , టూలింగ్ మరియు డిజైనింగ్ కోర్సు లలో శిక్షణ ఇస్తారు.  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో , నైపుణ్యాభివృద్ధి సంస్థ , యస్ సిసియఫ్ సి , యన్ బిసియఫ్ డిసి , యస్య యఫ్ డిసి , యన్ యస్ కెయఫ్ డిసి , పియఫ్ సియల్ మరియు ఇతర ఏజెన్సీలు , కార్పోరేట్ సంస్థల సహకారంతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

No comments:

Post a Comment