Breaking News

22/10/2019

బియ్యానికే పరిమితమవుతున్న రేషన్ః

వరంగల్, అక్టోబరు 22, (way2newstv.in)
ఒకప్పుడు రేషన్‌ షాపుకు వెళ్తే తొమ్మిది రకాల సరుకులు లభించేవి. ఇప్పుడు కేవలం బియ్యం తప్పా ఏమీ ఇవ్వడం లేదు.. అంత్యోదయ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న చక్కెరకు రేషన్‌ డీలర్లు మంగళం పాడుతున్నారు. ఆహారభద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు బియ్యంతో పాటు తొమ్మిది వస్తువులు రేషన్‌ షాపుల ద్వారా అందించేవారు. ప్రస్తుతం బియ్యానికే పరిమితమయింది. బియ్యంతో పాటు చక్కెర, పసుపు, కారం, చింతపండు, కందిపప్పు. ఉప్పు, గోధుమ పిండి, ఫామాయిల్, గోధుమలు అందించేవారు. రాను రాను అన్ని నిత్యావసర వస్తువులు ప్రభుత్వం ఇవ్వడం బంద్‌ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం అంత్యోదయ కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెరను సైతం అందించాలని గతంలోనే నిర్ణయించింది. 
బియ్యానికే  పరిమితమవుతున్న రేషన్ః

2015 సంవత్సరం తర్వాత ఆహార భద్రత కార్డులకు చక్కెర పంపి ణీ నిలిపివేశారు. అంత్యోదయకార్డులకు చక్కెరను ప్రభుత్వం అందిస్తోంది. జిల్లాలో 2,18,269 మొత్తం కార్డులుండగా అంత్యోదయ కార్డులు 12,187లు ఉన్నాయి. గత కొంత కాలంగా అంత్యోదయ కార్డుదారులకు చక్కెరను ప్రభుత్వం అందిస్తున్నా రేషన్‌ డీలర్లు అందించడం లేదు. ప్రతీ నెల రేషన్‌ డీలర్లు కేవలం బియ్యానికే డీడీలు చెల్లిస్తున్నారు. ప్రతి రేషన్‌షాప్‌లో పదుల సంఖ్య లో అంత్యోదయ కార్డులుంటాయి. ప్రభుత్వం అందిస్తున్న చక్కెరను అందించేందుకు రేషన్‌ డీలర్లు ముందుకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా సగం కంటే  తక్కువ మంది రేషన డీలర్లు మాత్రమే ఒక్కో నెల చక్కెరను అందిస్తున్నారు.. ఇంకో నెల అందించడం లేదు.చక్కెరను ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే రేషన్‌ షాపుల్లో గొడవలు జరుగుతున్నాయి. ఆహార భద్రత, అన్నపూర్ణ కార్డుదారులకు ఇవ్వకుండా కేవలం అంత్యోదయ కార్డులకే చక్కెరను ఇస్తే మిగతా వారి నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని రేషన్‌ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2015 జూన్‌ కంటే ముందు అన్ని కార్డు దారులకు అరకిలో చొప్పున చక్కెరను అందించేవారు. అంత్యోదయ కార్డుదారులకు చక్కెర అందడం లేదని సివిల్‌ సప్లయ్‌ అధికారులకు తెలిసినా సైతం పట్టించుకోవడం లేదు.

No comments:

Post a Comment