Breaking News

31/10/2019

ప్రైవేట్ రూట్లతో ఇబ్బందులే...

హైద్రాబాద్, అక్టోబర్ 31, (way2newstv.in)
ఆర్టీసీ బస్సు రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించడంపై దాదాపు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధాన రూట్లను మాత్రమే తీసుకునేందుకు ప్రైవేటు ఆపరేటర్లు ముందుకు వస్తారని, ఊర్లకు బస్సులు నడవడం కష్టమేనని అభిప్రాయం వస్తోంది. చార్జీలను తామే నిర్ణయిస్తామని సర్కారు చెప్తున్నా.. ప్రైవేటు ఆపరేటర్లను కంట్రోల్ చేయడం కష్టమని, అడ్డగోలు వసూళ్లకు, అవినీతికి తెరలేస్తుందన్న ఆందోళన కనిపిస్తోంది. ఆర్టీసీ ఆస్తులు, భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదమూ ఉందని సీనియర్ ఐఏఎస్లు, రవాణా రంగ నిపుణులు చెప్తున్నారు. రూట్లను ప్రైవేటుకు ఇస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేస్తున్నారు. ప్రజా రవాణాను లాభాల కోణంలో చూడవద్దని, ఆర్టీసీని సంస్కరించాలేగానీ ప్రైవేటు దిశగా అడుగులు వేయడం సరికాదని అంటున్నారు.
ప్రైవేట్ రూట్లతో ఇబ్బందులే...

ప్రైవేటు ఆపరేటర్లు ఏ రూట్లో ఎంత చార్జీ వసూలు చేయాలన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్న దానిపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది భవిష్యత్తులోనూ ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని, గతంలో కరెంటు విషయంగా మొండిగా వ్యవహరించిన చంద్రబాబు అధికారం కోల్పోయారని గుర్తుచేసుకోవాలని చెప్తున్నారు.ప్రైవేటు ఆపరేటర్లు ఏ రూట్లో ఎంత చార్జీ వసూలు చేయాలన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్న దానిపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అది ఆచరణలో సాధ్యం కాకపోవచ్చని ఓ సీనియర్  అధికారి అన్నారు. డీజిల్ ధరలు పెరిగిపోతున్నా ఆర్టీసీ చార్జీలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని, రాజకీయ కారణాలే దీనికి కారణమని చెప్పారు. ‘‘రూట్ల ప్రైవేటీకరణ జరిగితే ఆపరేటర్లు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు కూడా ప్రైవేటు ఆపరేటర్లకు మేలు చేసేందుకు ప్రయత్నించే చాన్స్ ఉంటుంది. చార్జీలపై నియంత్రణ సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వం అనుమతించకున్నా కూడా ప్రైవేటు ఆపరేటర్లు ఎక్కువగా వసూలు చేసే అవకాశం ఉంటుంది” అని ఆ ఆఫీసర్ పేర్కొన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మొదలవగానే.. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. పండుగ ముందురోజు హైదరాబాద్  నుంచి మంచిర్యాల వెళ్లేందుకు ఓ ఆపరేటర్ ఏకంగా రూ.1,500 చార్జీ వసూలు చేశారు. అదే ఆర్టీసీ బస్సులో అయితే చార్జీ రూ.240 మాత్రమే. పండుగ స్పెషల్ బస్సులైనా కూడా మరో యాభై, వంద రూపాయలు మాత్రమే ఎక్కువగా తీసుకునేవారు. రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తే ఇదే తరహాలో అడ్డగోలు చార్జీలకు తెరలేస్తుంది. రూట్ ను తీసుకున్న సంస్థకు ఆ మార్గంలో గుత్తాధిపత్యం వస్తుంది. మిగతా సంస్థల బస్సులు నడిపే చాన్స్ ఉండదు. ఆర్టీసీ బస్సులూ తిరగవు. జనానికి ఇబ్బందులు తప్పవు.ప్రస్తుతం ఆర్టీసీలో ఒక్కో బస్సుకు సగటున ఐదుగురు పనిచేస్తున్నారు. రూట్లను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడితే ఆర్టీసీలో రెండు వేల వరకు బస్సులు తగ్గుతాయి. అంటే 10 వేల మందికిపైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారు. ఇట్లాగే కొనసాగుతూ ఉంటే ప్రభుత్వ సెక్టార్ లో ఉద్యోగాలు పోతాయి. ప్రైవేటు బస్సులు నడిచినా డ్రైవర్లకు, కండక్టర్లకు ఆపరేటర్లు ఇచ్చే జీతాలు చాలా తక్కువ. ఉద్యోగ భద్రత ఉండదు.రూట్లను కొనుగోలు చేసిన సంస్థలకు ఆర్టీసీ డిపోలు, ఆస్తులను కూడా అప్పగించే చాన్స్ ఉందని ఆర్టీసీలోని ఓ అధికారి చెప్పారు. వాటిని 33 ఏళ్ల లీజు పేరిట ఇచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత ఆయా సంస్థలు సదరు భూములు, ఆస్తులను చేజిక్కించుకునేందుకు రాజకీయంగా ప్రయత్నించే ప్రమాదముందని పేర్కొన్నారు. ‘హైదరాబాద్ తోపాటు వివిధ జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీకి ఎన్నో విలువైన భూములు ఉన్నాయి. అక్కడ ప్రైవేటు ఆపరేటర్లు సినీ, షాపింగ్ మాల్స్  కట్టి భారీగా లాభాలు తీసుకుని, సర్కారుకు మాత్ర నామమాత్రపు ఫీజు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.ప్రైవేటు ఆపరేటర్లు ఆదాయం వచ్చే రూట్లను మాత్రమే కొనుగోలు చేస్తారు. మారుమూల ప్రాంతాల్లో బస్సులు నడిపించడం కష్టం. గ్రామాల్లోకి వెళ్లే బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో, ఆదాయం బాగా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేనో, ఎంపీనో రికమెండ్  చేశారని చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. ప్రధాన రూట్లను ప్రైవేటుకు ఇచ్చినా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని చెప్తున్నారు. నష్టాలే వచ్చే పరిస్థితిలో ఊర్లకు ఎంతకాలం ఆర్టీసీ బస్సులు నడుపుతారన్న దానిపై సీనియర్ ఐఏఎస్లలో, రవాణా రంగ నిపుణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ప్రైవేటు బస్ ఆపరేటర్లను కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. అది పనిచేసే అవకాశాలు తక్కువేనని ఓ సీనియర్ అధికారి కామెంట్ చేశారు. ఇప్పటికే ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్లో విపరీతమైన అవినీతి ఉందన్న విమర్శలున్నాయి. వాహనం రిజిస్ట్రేషన్  మొదలు ఫిట్ నెస్, లైసెన్సులు, పర్మిట్లు.. ఇలా ప్రతిచోటా పైసల్లేనిదే పని కాదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక కాంట్రాక్టు క్యారియర్లు ఇచ్చే డబ్బులు తీసుకుని.. బస్సుల్లోని సీట్ల సంఖ్య, ఫిట్ నెస్ లను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని, ఒకే నంబర్ తో రెండు మూడు బస్సులను తిప్పుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పుడు రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తే అవినీతి మరింతగా పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ చార్జీలు వసూలు చేసినా పట్టించుకోరని, ఫిర్యాదులు వచ్చినా, నిబంధనలు పాటించకపోయినా చూసీ చూడనట్టు వదిలేసే అవకాశం ఉంటుందని చెప్తున్నా

No comments:

Post a Comment