ఎంపీ బాపూరావు
ఆసిఫాబాద్ అక్టోబర్ 31(way2newstv.in):
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి వచ్చిన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో మాట్లడారు. కేంద్ర ప్రభుత్వంనుండి వస్తున్న పథకాలను నిధులని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని ప్రజలకు అందకుండా చేస్తుందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఆర్ టి సి ఆస్తులను అమ్మాలని చూస్తుందన్నారు. సిర్పూర్ పేపర్ మిల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం పై యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి మానుకొని ఇప్పటికైనా ప్రమాదంలో గాయపడ్డ కార్మికులకు తగిన న్యాయం చేయాలని అన్నారు.
కేంద్ర నీధులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది
పేపర్ మిల్ పరిశ్రమలో విధులకు స్థానికూలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉమ్మడి అదిలాబాదు వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జెపి జై బి పౌడెల్, బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డా. కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఠాకూర్ విజయ్ సింగ్, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమురం వందన, సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ కొంగ సత్యనారాయణ, బీజేపీ నాయకుడు రావి శ్రీను,బీజేపీ కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షుడు గోలెం వెంకటేష్, మాజీ జడ్పీటీసీ ఛైర్మెన్ సిడెం గణపతి, ప్రధాన కార్యదర్శి మేడీ కార్తీక్, సీనియర్ నాయకులు ధోని శ్రీశైలం, బజ్జుర్ మండల తుడుండెబ్బ నాయకుడు సోయం చిన్నాన్న, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శరద్ శర్మ, ఎమ్మాజీ సంతోష్, దిలీప్ పాల్గొన్నారు
No comments:
Post a Comment