Breaking News

28/10/2019

మార్కెట్ యార్డులలో కొత్త నిబంధనలు

నిలిచిపోతున్న కొనుగోళ్లు
మెదక్, అక్టోబరు 28, (way2newstv.in)
జహీరాబాద్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో పెసర కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట రైతులు నమూనాలను తీసుకొస్తే తేమ శాతాన్ని పరీక్షించిన తర్వాత ఒక తేదీని కేటాయిస్తూ అధికారులు తేదీని ఇస్తున్నారు. రోజురోజుకూ అధిక బస్తాలు వస్తుండటంతో రైతులకు 15 నుంచి 20 రోజుల ముందే టోకెన్లు జారీ చేస్తున్నారు. గురువారం రోజును కేటాయించిన రైతులు అక్కడికి చేరుకోగా కేంద్రం వద్ద అధికారులెవ్వరు లేకపోగా, గిడ్డంగిని సైతం తెరవలేదు. ఏకంగా రెండు వందల మంది వరకు రైతులు రెండు వేలకు పైగా బస్తాలను ట్రాక్టర్లలో తీసుకొచ్చారు. 
 మార్కెట్ యార్డులలో కొత్త నిబంధనలు

ఇక్కడి పరిస్థితిని చూసి, ఏం చేయాలో తోచక మార్క్‌ఫెడ్‌ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఝరాసంగం మండలం చీలేమామిడికి చెందిన హన్మంతు అనే రైతు 15 రోజుల క్రితం పెసర నమూనాలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించిన అధికారులు ఈనెల 25వ తేదీన తీసుకురావాలని సూచించారు. అధికారుల సూచన ప్రకారం ఉదయం బస్తాలు తీసుకురాగా మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. జహీరాబాద్‌ మండలం మల్‌చెల్మకు చెందిన నారాయణ అనే రైతుకు సైతం 25వ తేదీని కేటాయించడంతో 10 బస్తాలను తీసుకొచ్చారు. మధ్యాహ్నం వరకు కొనుగోలు చేయకపోవటంతో పడిగాపులు కాశారు. జహీరాబాద్‌లోని పెసర కొనుగోలు కేంద్రం వద్ద  కొనుగోళ్లు నిలిపి వేయడంతో వందలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అక్కడికి బస్తాలను తరలించేందుకు ఒక్కో బస్తాపై అదనంగా రూ.60 రవాణా ఖర్చు మీద పడుతోంది. దీనికితోడు ఇక్కడి నుంచి అక్కడికి తరలింపుతో తీవ్ర జాప్యం జరిగి రాత్రి చీకటి పడేవరకు కూడా కొనుగోళ్లు ముగియక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రస్తుతం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మార్కెట్‌ యార్డు పరిధిలోని గిడ్డంగి సామర్థ్యం చిన్నదిగా ఉండటంతో ఏరోజు ధాన్యాన్ని ఆరోజే మార్క్‌ఫెడ్‌ గిడ్డంగికి పంపించి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. వర్షాల కారణంగా సదాశివపేటలోని ప్రధాన గిడ్డంగి వద్దకు లారీలు వెళ్లడానికి అంతరాయం కల్గటంతో రెండు రోజులుగా ధాన్యం తరలించలేదు. కొనుగోలు చేసిన ధాన్యం ఆరుబయటే నిల్వ ఉంచగా కొనుగోలును నిలిపి వేయడంతో ఇబ్బందులు తలెత్తాయి.

No comments:

Post a Comment