Breaking News

03/10/2019

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంగుల

హైదరాబాద్  అక్టోబరు 3, (way2newstv.in)
బిసి కమిషన్ కార్యాలయంలో గురువారం నాడు గంగుల  కమలాకర్  పౌరసరఫరాల శాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా అయనకు ఆర్థిక శాఖమంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ  మంత్రి పదవి ఇచ్చినందేరే  సీఎం కేసీఆర్కు  కృతజ్ఞతలు తెలిపారు. రెండు శాఖల ద్వారా బడుగుబలహీన వర్గాలకు సేవచేసే అవకాశం కేసీఆర్ ఇచ్చారు. 
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంగుల

ముఖ్యమంత్రి నా పై పెట్టుకున్న  నమ్మక వమ్ము చేయనని అన్నారు. ముఖ్యమంత్రి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చారు. ఖరీఫ్ లోధాన్యం పెరిగే అవకాశం ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. ప్రతి పేద బిడ్డ ని ముఖ్యమంత్రి ఆదుకుంటారు అని నమ్మకం కలిగింది. ఒక్క బియ్యంగింజ నల్లబజారుకు తరలకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతి బిడ్డ చదువుకోవలని గురుకులాలు తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా చూసుకుంటామని గంగుల అన్నారు.

No comments:

Post a Comment