Breaking News

24/10/2019

వలంటీర్లకు అప్పుడే అనాసక్తి

విజయవాడ, అక్టోబరు 24 (way2newstv.in)
దేశ చరిత్రలోనే ఒకేసారి లక్షన్నర ఉద్యోగాలను కల్పించామని ఇప్పుడు చుడండి మా తడాఖా అంటూ వైసిపి చంకలు గుద్దుకుంది. అంతేకాదు తాము నియమించిన గ్రామవాలంటీర్ల వ్యవస్థతో నేరుగా ప్రజలతో సంబంధాలు మెరుగు పడతాయని చెప్పుకొచ్చింది. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని వారికి అందించే అవకాశాలు ఉన్నాయని సంతోష పడింది. అయితే సర్కార్ ఆశించింది ఒకటైతే గ్రౌండ్ లో జరుగుతుంది మరొకటి అని తేలుతుంది. వాలంటీర్లకు ప్రజా సమస్యలపై అవగాహన లేకపోవడం సర్కార్ ఆశయాలు లక్ష్యాలతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తూ ఉండటం, వైసిపి నేతల రికమండేషన్ల తో కొందరికి ఉద్యోగాలు దక్కడం, జీతం తక్కువ పనిభారం ఎక్కువ అనే ఆలోచనతో ఉండటం వారిపనితీరుపై ప్రభావం చూపిస్తున్నట్లు తేలుతుంది. 
వలంటీర్లకు అప్పుడే అనాసక్తి

దీనికి తోడు చాలా చోట్ల వాలంటీర్లుగా ఎంపిక అయినవారు ఉద్యోగాల్లో చేరకపోవడం ఇతర ఖాళీలు కొత్త సమస్యలకు తెరతీస్తున్నాయి.గ్రామ వాలంటీర్లకు 50 నుంచి 100 కుటుంబాల పర్యవేక్షణ మాత్రమే. ఈ అతి తక్కువ కుటుంబాల వివరాలను నమోదు చేయడంలో కూడా వీరు విఫలం అవుతున్నారు. ముఖ్యంగా నగర, పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్ళల్లో ఉండేవారిని వాలంటీర్లు గుర్తించాలి. వారిచేత ప్రభుత్వం ఇచ్చే గృహాలు లేదా స్థలం కోసం దరఖాస్తు పూరించి తీసుకోవాలి. ఇళ్ళు లేని నిరుపేదలు వుండరాదన్నది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. అందుకోసం ఆయన ప్రతి ఇంటిని లెక్కగట్టి అందులో అద్దెకు ఉండేవారి వివరాలు తీసుకోవాలని ఆ లెక్కలను బట్టి స్థలాలను, గృహాలను నిర్మించాలని ఆశించారు. అయితే ఇక్కడే వాలంటీర్లు తమ నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు. ఇల్లు ఇల్లు తిరగకుండానే వివరాలను ఆయా అధికారులకు అప్పగించి చేతులు దులిపేసుకుంటున్నారు.దీనికి ప్రధాన కారణం ఒక్కో ఇంట్లో అద్దెకు వుండేవారి వివరాలు తీసుకోవడం తిరిగి వారిచేత ఇళ్లకోసం స్థలాల కోసం దరఖాస్తు చేయించడం తమపై మరింత పనిభారం పెంచుతుందనే ఇలా చేస్తున్నట్లు తేలుతుంది. చాలా చోట్ల వాలంటీర్ల నిర్వాకాన్ని అటు అధికారపార్టీకి చెందిన వైసిపి నేతలు ఇటు విపక్షానికి చెందిన టిడిపి నేతలు గుర్తించి ఉన్నతాధికారుల ముందు లబోదిబో అంటున్నారు. గతంలో తాము సేకరించిన వివరాలకు వాలంటీర్లు ఇచ్చిన వివరాలకు ఎలాంటి పొంతన లేకపోవడంతో రీ సర్వేకి సర్కార్ ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్ల పనితీరు ఇలాగే ఉంటే కష్టమని 44 రకాల సేవలను వీరిద్వారా ప్రజలకు అందించాలని భావిస్తున్న ప్రభుత్వం సరైన శిక్షణ తో బాటు వేతనం కూడా ఇచ్చి పర్యవేక్షించాలని లేకపోతే సంక్షేమ పథకాల అమలు అస్తవ్యస్తంగా మారుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఒకసారి దృష్టి సారించాలని వైసీపీ నేతలే కోరుకుంటున్నారు.

No comments:

Post a Comment