Breaking News

31/10/2019

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ముంబై, అక్టోబర్ 31 (way2newstv.in)
ఇటీవల పడుతూ వచ్చిన బంగారం ధర గురువారం స్వల్పంగా పైకి కదిలింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ఫ్యూచర్స్ ధర మార్నింగ్ సెషన్‌లో 0.13 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.37,964కు చేరింది. అలాగే వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.36 శాతం పెరుగుదలతో కేజీకి రూ.46,155కు ఎగసింది.బంగారం ధర సెప్టెంబర్ నెల ఆరంభంలో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర దాదాపు రూ.2,000 పడిపోయింది. 
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

వెండి ధర కూడా గత నెలలో ఏకంగా రూ.51,000 మార్క్‌ పైకి చేరిన విషయం తెలిసిందే.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,488 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. అమెరికా పెడరల్ రిజర్వు కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇకపోతే బంగారం ధర ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 1,550 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. ఇది ఆరేళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం.గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఏడాది బంగారం ధర దాదాపు 16 శాతం మేర పరుగులు పెట్టింది. వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, ఆర్థిక మాంద్య భయాలు వంటి పలు అంశాలు బంగారం ధర పెరుగుదలకు కారణంగా నిలిచాయి.

No comments:

Post a Comment